హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ప్రభుత్వ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన బీజేపీ నేత.. వీడియో వైరల్

ప్రభుత్వ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన బీజేపీ నేత.. వీడియో వైరల్

ఉద్యోగిని కొడుతున్న సొనాలి ఫొగట్

ఉద్యోగిని కొడుతున్న సొనాలి ఫొగట్

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సొనాలి.. ఆయనపై చెప్పులతో దాడి చేశారు. వద్దు మేడం.. అంటున్నా వినకుండా ఎడా పెడా వాయించారు. నీకు బతికే హక్కు కూడా లేదంటూ మండిపడ్డారు.

బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్ సొనాలి ఫొగట్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ ప్రభుత్వ ఉద్యోగిపై ఆమె చేయి చేసుకున్నారు. ఏకంగా చెప్పు తీసుకొని ఆయన్ను ఇష్టానుసారం కొట్టారు. హర్యానాకు చెందిన సొనాలి ఫొగట్.. శుక్రవారం హిస్సార్‌ జిల్లాలోని బల్సామండ్ మండికి రైతులతో కలిసి వెళ్లారు. మార్కెట్ కమిటీ అధికారులపై ఫిర్యాదులు రావడంతో వారితో మాట్లాడేందుకు వెళ్లారు. ఐతే ఆ సమయంలో సొనాలి ఫొగట్‌పై మార్కెట్ కమిటీ ఉద్యోగి సుల్తాన్ అసభ్య కామెంట్లు చేసినట్లు తెలిసింది. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సొనాలి.. ఆయనపై చెప్పులతో దాడి చేశారు. వద్దు మేడం.. అంటున్నా వినకుండా ఎడా పెడా వాయించారు. నీకు బతికే హక్కు కూడా లేదంటూ మండిపడ్డారు. అక్కడే పోలీసులు ఉన్నా మౌనంగా ఉండిపోయారు. అనంతరం ఆ అతడిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది సొనాలి ఫొగట్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బీజేపీ నేత తీరుపై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ట్విటర్ వేదికగా స్పందించారు. '' మార్కెట్ ఉద్యోగిని పశువును కొట్టినట్లు కొట్టారు. ప్రభుత్వ ఉద్యోగం చేయడమే నేరమా..? ఉద్యోగిపై చెప్పులతో దాడి చేసిన సొనాలి ఫొగట్‌పై సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చర్యలు తీసుకుంటారా?'' అని ఆయన ప్రశ్నించారు.


ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సొనాలి ఫొగట్ వివరణ ఇచ్చారు. మార్కెట్ యార్డులో వెళ్తున్నప్పుడు అతడు తన కులం పేరు ప్రస్తావిస్తూ దూషించాడని చెప్పారు. అంతేకాదు అక్కడే ఉన్న ఓ మహిళా ఉద్యోగి, మహిళా మంత్రిపైనా అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని.. అందుకే కోపమొచ్చి కొట్టాడని తెలిపారు. మరి చట్టాన్ని ఎందుకు చేతుల్లోకి తీసుకున్నారని రిపోర్టర్లు పశ్నించగా.. ''మరి మహిళలపై ఇలా మాట్లాడే హక్కు అతనికి ఎక్కడిది? గుణపాఠం చెప్పకుండా వదిలిస్తే.. రేపు ఇంకో మహిళపైనా ఇలాగే ప్రవర్తిస్తాడు''.అని సొనాలి ఫొగట్ జవాబిచ్చారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ తరపున పోటీచేసిన ఆమె.. కాంగ్రెస్ నేత కుల్దీప్ బిష్నోయ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

First published:

Tags: Bjp, Haryana

ఉత్తమ కథలు