హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

యాసిడ్ దాడులు, అత్యాచారాలకు ప్రేరణ... ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ చెయ్యాలని డిమాండ్లు...

యాసిడ్ దాడులు, అత్యాచారాలకు ప్రేరణ... ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ చెయ్యాలని డిమాండ్లు...

యాసిడ్ దాడులు, అత్యాచారాలకు ప్రేరణ... ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ చెయ్యాలని డిమాండ్లు...  (credit - instagram)

యాసిడ్ దాడులు, అత్యాచారాలకు ప్రేరణ... ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ చెయ్యాలని డిమాండ్లు... (credit - instagram)

ఇండియాలో Ban Tiktok అంటూ ఓ ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. టిక్‌టాక్ వల్ల అంతా నష్టమే జరుగుతోందని కొందరు మండిపడుతున్నారు.

చైనాకు చెందిన కంపెనీ బైట్‌ డాన్స్... 2016లో ప్రారంభించిన టిక్‌టాక్... ప్రపంచ దేశాల్లో కంటే... ఇండియాలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. షార్ట్ వీడియో మెసేజ్ పేరుతో ప్రారంభమైన ఈ యాప్‌కి ఇండియన్ యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. మొదట్లో చాలా మంది తమ టాలెంట్ చూపించేందుకు ఈ యాప్‌ని బాగా ఉపయోగించుకున్నారు. ఐతే... నెలలు గడుస్తున్న కొద్దీ... ఈ యాప్‌లో కంటెంట్ అదుపుతప్పింది. ప్రస్తుతం ఓ పద్ధతీ, పాడూ లేకుండా... ఇష్టమొచ్చినట్లు వీడియోలు పెడుతున్నారు చాలా మంది వాటిలో కొన్ని అసభ్యకరమైనవి ఉంటున్నాయి. అమ్మాయిలను రేప్ చేస్తున్నట్లు, అమ్మాయిలపై యాసిడ్ దాడులు చేస్తున్నట్లు, కరోనా వైరస్ కావాలనే ఇతరులకు అంటిస్తున్నట్లు, జంతువులను ఉరి తీస్తున్నట్లు ఇలా... ఎన్నో రకాల వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి.


ఈ యాప్‌‌ని ఇలాగే వదిలేస్తే... ఇది దేశానికే ప్రమాదకరం అంటున్నారు చాలా మంది. ఇందులో కొంత మంది ఉగ్రవాద ప్రేరేపిత వీడియోలు కూడా పెడుతున్నారు. అలాగే... సంఘ వ్యతిరేక శక్తులు కూడా ఈ యాప్‌ని వాడుకుంటూ... ప్రజలను తప్పుదారి పట్టించే ప్రసంగాలు చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో అనర్థాలు ఈ యాప్ వల్ల జరుగుతున్నాయనే విమర్శలు పెరుగుతున్నాయి.


ముఖ్యంగా మహిళలకు వ్యతిరేకంగా వస్తున్న వీడియోలు... తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇలాంటి కంటెంట్ ఎందుకు పెడుతున్నారు? ఇలాంటి వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నవారిపై చర్యలేవి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫైజల్ సిద్ధిఖీ అనే ఓ యూజర్‌పై జాతీయ మహిళ కమిషన్ (NCW)... కంప్లైంట్ నమోదు చేసింది. ఓ మహిళపై యాసిడ్ దాడి చేస్తున్నట్లుగా వీడియో ఉండటంపై NCW తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. 15 ఏళ్ల వయసులో యాసిడ్ దాడిని ఎదుర్కొన్న లక్ష్మీ అగర్వాల్ కూడా ఆ వీడియోను తప్పుపట్టారు.

ప్రస్తుతం టిక్‌టాక్‌కి ఇండియాలో 8.1 కోట్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీరంతా 2019లో 550 కోట్ల గంటల సమయాన్ని టిక్ టాక్ వీడియోలు చూసేందుకు కేటాయించారు. మహిళల్ని వేధించే వీడియోలు రోజురోజుకూ పెరిగిపోతుండటం, వాటినే యూజర్లు ఎక్కువగా చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

2019 ఏప్రిల్‌లో మద్రాస్ హైకోర్టు తీర్పుతో ఈ యాప్‌ని కేంద్రం నిషేధించింది. ఐతే... ఇకపై తగిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం చెప్పడంతో... కొన్ని రోజులకే కేంద్రం ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. ఏడాది గడిచింది... పరిస్థితి మారలేదు. ఇప్పుడు మరింత ఎక్కువగా హింసాత్మక, వివక్షాపూరిత వీడియోలు ఈ యాప్‌లో కనిపిస్తున్నాయి.

ఐతే.... టిక్‌టాక్‌ని బ్యాన్ చేసినంత మాత్రాన... ఇలాంటి కంటెంట్ పెట్టే వాళ్లు మారతారని అనుకోలేమంటున్నారు మానసిక వేత్తలు. టిక్ టాక్ కాకపోతే... ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్... ఇలా మరో యాప్ వెతుక్కుంటారనీ, అసలు ఇలాంటి వీడియోలు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో కంటెంట్ విషయంలోనూ చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

First published:

Tags: Tiktok

ఉత్తమ కథలు