ప్రాణం తీసిన టిక్‌టాక్.. వీడియో తీస్తూ చేపను మింగడంతో ఊపిరాడక..

ప్రతీకాత్మక చిత్రం

Tik Tok Latest News | ఓ యువకుడు టిక్‌టాక్‌లో పాపులర్ కావాలనే ఉద్దేశంతో వినూత్నంగా వీడియో చేయబోయాడు. సదరు యువకుడు ఓ చేపను మింగుతూ వీడియో చేయాలని భావించాడు.

 • Share this:
  టిక్‌టాక్.. ఈ పేరు వినగానే కొంతమందికి పూనకం వచ్చేస్తుంది. టిక్‌టాక్‌లో పేరు సంపాదించాలనే ఉద్దేశంతో వినూత్నంగా వీడియోలు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. వాస్తవానికి టిక్‌టాక్ యాప్ మొదటి నుంచి వివాదస్పదంగానే మారుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతోంది. భారత్‌లోనూ దీన్ని నిషేధించాలన్న ఎప్పట్నుంచో డిమాండ్ విన్పిస్తోంది. అయితే ఓ యువకుడు టిక్‌టాక్‌లో పాపులర్ కావాలనే ఉద్దేశంతో వినూత్నంగా వీడియో చేయబోయాడు. సదరు యువకుడు ఓ చేపను మింగుతూ వీడియో చేయాలని భావించాడు. కానీ ఆ ఆలోచనే అతడి ప్రాణం తీసింది. చేపను మింగడంతో ఊపిరాడక చనిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక హోసూరులోని కేలైకుంట పార్వతీనగర్‌కు చెందిన శరవణన్ కొడుకు వెట్రివేల్(22) డిగ్రీ చదువుతున్నాడు.

  tik tok latest news, tik tok viral video, tik tok fish, tik tok teenager death, karnataka, survivor ticktok, టిక్‌టాక్, వీడియో, చేప, యువకుడి మృతి, కర్ణాటక, ప్రాణం తీసిన టిక్‌టాక్
  టిక్ టాక్ చేస్తూ మృతి చెందిన వెట్రివేల్


  అయితే వెట్రివేల్ టిక్‌టాక్‌లో పాపులర్ అయ్యేందుకు మంచి వీడియో రూపొందించాలని భావించాడు. అందులో భాగంగానే ప్రాణంతో ఉన్న ఓ చేపను మింగుతూ వీడియో తీసుకున్నాడు. అయితే ఆ చేప గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో వెట్రివేల్‌కు ఊపిరాడక గిలగిలలాడాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వెట్రివేల్ చనిపోయినట్టు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Narsimha Badhini
  First published: