Home /News /national /

TIK TOK BANNED IN INDIA HERE IS NETIZENS REACTION IN SOCIAL MEDIA SK

TikTok Ban: భారత్‌లో టిక్ టాక్‌పై నిషేధం.. నెటిజన్ల రియాక్షన్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చైనాకు బుద్ధి చెప్పేందుకు మంచి నిర్ణయం తీసుకున్నారని కొందరంటే.. అయ్యో మా జీవితాలను నాశనం చేశారంటూ ఇంకొందరు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూడండి.

    టిక్ టాక్..! యువతకు పరిచయం అక్కర్లేని మొబైల్ అప్లికేషన్..! అంతలా జనాలకు దగ్గరైంది ఈ చైనీస్ అప్లికేషన్..! టిక్ టాక్‌ను కొందరు టైమ్ పాప్ కోసం యూజ్ చేస్తే.. ఇంకొందరు మాత్రం సీరియస్‌గా దానికే పరిమితమయ్యారు. నిత్యం వీడియోలు తీయడం.. వాటిని సృజనాత్మకంగా రూపొందించడం.. ఒక డ్యూటీలా చేస్తున్నారు. ఈ యాప్‌లో తన ప్రతిభను చూపించి.. సినిమాలు, టీవీ స్క్రీన్‌పై అవకాశాలు తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు. ఐతే ఇప్పుడు టిక్ టాక్‌పై కేంద్రం నిషేధం విధించింది. భారతదేశ సార్వభౌమాధికారం సమగ్రత, దేశ యొక్క రక్షణ, భద్రత దృష్ట్యా టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్స్‌పై నిషేధిస్తున్నట్లు పేర్కొంది. టిక్ టాక్‌ను నిషేధించాలని చాలా కాలంగా డిమాండ్ ఉన్నా.. బ్యాన్ చేస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ కేంద్రం అనూహ్యంగా చైనా యాప్స్‌పై ఉక్కుపాదం మోపింది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు.

    చైనాకు బుద్ధి చెప్పేందుకు మంచి నిర్ణయం తీసుకున్నారని కొందరంటే.. అయ్యో మా జీవితాలను నాశనం చేశారంటూ ఇంకొందరు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూడండి.

    టిక్‌టాక్ యాప్ బ్యాన్ అయిందని ఆ యాప్ యూజర్లు ఏడుస్తుంటే.. పబ్ జీ యూజర్లు మాత్రం నవ్వుతున్నారని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

    ప్రస్తుతం టిక్ టాక్‌ బానిసైన వారి పరిస్థితి ఇలా ఉంది.


    టిక్ టాకర్స్ జీవితాలు ఇలా రోడ్డున పడ్డాయంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.


    భారతీయుడిగా గర్విస్తున్నానంటూ మరో నెటిజన్ స్పందించాడు.


    First published:

    Tags: Tik tok, Tiktok

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు