• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • TIHAR INMATES LIKELY TO RECEIVE VIRTUAL VISITORS FROM NEXT WEEK BN

జైళ్ల శాఖ కీలక నిర్ణయం.. ఖైదీలకు భారీ ఊరట

జైళ్ల శాఖ కీలక నిర్ణయం.. ఖైదీలకు భారీ ఊరట

తీహార్ జైలు(File)

ఢిల్లీలోని తీహార్, రోహిణి, మండోలి జైళ్లతో పాటు 16 సబ్ జైళ్లలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.ఢిల్లీలోని తీహార్, రోహిణి, మండోలి జైళ్లతో పాటు 16 సబ్ జైళ్లలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

  • Share this:
    ప్రపంచవ్యాప్తంగా రోజురోజూకీ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. పేద, ధనిక అన్న తేడా లేకుండా కరోనా వైరస్ ఎవ్వరినీ వదిలిపెట్టడంలేదు. చివరకు జైళ్లలో మగ్గిపోతున్న ఖైదీలు కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో జైళ్ల శాఖ ఇప్పటికే కొంతమంది ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేశారు. తాజాగా ఖైదీలు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు కొన్ని కీలక మార్గదర్శకాలను జైళ్ల శాఖ విడుదల చేసింది. ఖైదీలతో మిలాఖత్ అయ్యేవారి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇక నుంచి వారంతా జైళ్లకు రాకుండానే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఖైదీలతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో మాట్లాడేలా అనుమతించేందుకు అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా ఢిల్లీలోని తీహార్, రోహిణి, మండోలి జైళ్లతో పాటు 16 సబ్ జైళ్లలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఖైదీలే కాకుండా జైలు వార్డర్లకు సైతం ములాఖత్ నిలిపివేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడించనున్నారు.

    అందుకోసం ఇప్పటికే ఆయా జైళ్లలో కంప్యూటర్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖైదీల యోగక్షేమాలు తెలసుకునేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం తీహార్ జైలులో 14 వేల మంది ఖైదీలు ఉన్నారు. అందులో 141 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. మిగతా ఖైదీలు వారి న్యాయవాదులు, కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడేందుకు అనుమతిస్తామని తీహార్ జైలు అధికారులు ప్రకటించారు. ఇదిలావుంటే.. ఇప్పటికే యూకే, యూఎస్ వంటి దేశాల్లోని ఖైదీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే అవకాశం కల్పించారు.
    Published by:Narsimha Badhini
    First published: