• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • TIGRESS BEATEN TO DEATH BY UP VILLAGERS AUTOPSY SHOWS BROKEN RIBS INJURIES ON EVERY BODY PART BS

జనావాసాల్లోకి దూరిన పులి.. కర్రలతో కొట్టి చంపిన గ్రామస్తులు..

జనావాసాల్లోకి దూరిన పులి

Tigress Beaten: అడవి నుంచి గ్రామంలోకి దూరిన ఓ పులి పలువురు గ్రామస్తులను గాయపరిచిందన్న కోపంతో దాన్ని వెంటాడి, వేటాడి చంపేశారు ఆ గ్రామస్తులు. కర్రలతో చితక్కొడుతూ.. దాని అంతు చూశారు.

  • Share this:
అడవి నుంచి గ్రామంలోకి దూరిన ఓ పులి పలువురు గ్రామస్తులను గాయపరిచిందన్న కోపంతో దాన్ని వెంటాడి, వేటాడి చంపేశారు ఆ గ్రామస్తులు. కర్రలతో చితక్కొడుతూ.. దాని అంతు చూశారు. పారిపోతున్నా వదలిపెట్టకుండా వెంబడిస్తూ తీవ్రంగా గాయపరిచి చంపేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలిబిత్ జిల్లాలొ చోటు చేసుకుంది. తొలుత గ్రామంలోకి వచ్చిన పులి.. 9 మందిని తీవ్రంగా గాయపరిచింది. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు పులిపై కర్రలతో, ఇనుపరాడ్లతో దాడి చేశారు. విచక్షణారహితంగా చితకబాదారు. దీంతో దాని ప్రతి అవయవం చచ్చుబడిపోయింది. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ పులిని ఆస్పత్రికి తరలించేందుకు కూడా గ్రామస్తులు అనుమతించలేదు. దీంతో అది అక్కడే మృతి చెందింది.

అయితే పులిని చంపిన 43 మంది గ్రామస్తులపై ఫారెస్ట్‌ అధికారులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా, 2012 నుంచి ఇప్పటి దాకా ఈ జిల్లాలో 16 పులులు, 3 చిరుత పులులు మృతి చెందాయి.
First published: