Home /News /national /

TIGER WHICH KILLED FIVE PERSON FINALLY CAUGHT IN UTTAR PRADESH AK

Tiger: ఎట్టకేలకు దొరికిన పెద్దపులి.. కానీ ఏపీలో కాదు.. ఇప్పటికే ఐదుగురుని తినేసింది

పట్టుబడ్డ పెద్దపులి

పట్టుబడ్డ పెద్దపులి

Tiger: పట్టుబడ్డ ఆడపులి వయస్సు 9 సంవత్సరాలు అని దుధ్వా టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ పాఠక్ తెలిపారు.

    అటవీ ప్రాంతాల నుంచి పులులు జనాలు నివసించే గ్రామాల వైపు రావడం ఇప్పుడు తరచూ జరుగుతోంది. ఓ వైపు ఏపీలోని పలు జిల్లాల్లో భయాందోళనలు సృష్టిస్తున్న పెద్దపులి ఇంకా అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కలేదు. పలు జంతువులను వేటాడుతున్న పులి (Tiger) కోసం అధికారుల అన్వేషణ సాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఇదే రకంగా భయాలను రేకెత్తిస్తున్న రెండు పులులను పట్టుకోవడంలో మాత్రం అధికారులు ఎట్టకేలకు విజయం సాధించారు. యూపీలోని (Uttar Pradesh) బహ్రైచ్ జిల్లాలోని కతర్నియాఘాట్‌లోని మజ్రా బీట్‌లో గత కొద్ది రోజులుగా భీభత్సానికి పర్యాయపదంగా మారింది. నరమాంసానికి అలవాటు పడినట్టుగా ఉన్న ఆడపులిని పట్టుకోవడంలో అటవీశాఖ(Forest Department) ఎట్టకేలకు విజయం సాధించింది. పులిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టింది.

    చాలా చోట్ల బోనులు వేసి ఆడపులిని బోనులో బంధించారు. ఈ పులి గత కొద్దిరోజుల వ్యవధిలోనే ఐదుగురిని బలితీసుకుంది. దీంతో ఆ ప్రాంతమంతా భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ పులి మజ్రా బీట్‌లో భయాందోళనలు సృష్టించింది. గత కొన్ని రోజులుగా ఈ పులి ఐదుగురిని వేటాడడంతో చుట్టుపక్కల గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సంఘటనల తర్వాత పులుల కార్యకలాపాలను అర్థం చేసుకోవడానికి అటవీ శాఖ ఆ ప్రాంతంలో మూడు డజన్ల ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసింది.



    ఈ కెమెరాలతో రెండు పులులను అటవీశాఖ గుర్తించింది. బోనులో బంధించిన రెండు రోజుల తర్వాత ఓ మగ పులిని అటవీ శాఖ బోనులో బంధించారు. ఆ తర్వాత గురువారం ఆడపులిని కూడా బోనులో బంధించారు. మజ్రా ప్రాంతంలో జరుగుతున్న సంఘటనల కారణంగా అటవీ శాఖ నిరంతరం చురుగ్గా పనిచేస్తుందని.. కానీ ఈ రోజు విజయం సాధించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

    Covid-19: కొంతమందికి కరోనా వైరస్ ఎందుకు సోకట్లేదు..? సైంటిస్ట్‌లు చెప్పిన షాకింగ్ విషయాలు ఇవే..!

    Credit Card Rules: జూలై 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్.. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

    పులి వయస్సు 9 సంవత్సరాలు అని దుధ్వా టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ పాఠక్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఎలాంటి సంఘటనలు జరిగినా ఈ పులి చేస్తోందని, ఎందుకంటే ఈ పులి దంతాలు కూడా అరిగిపోయాయని విశ్వాసంతో చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ఈ పులి మనుషులను వేటాడుతున్నట్లు పూర్తిగా తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ఏర్పాటు కొనసాగుతుందని, అటవీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తారని పాఠక్ చెప్పారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Tiger, Uttar pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు