సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండేవారిలో... ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఒకరు. ఆయన తరచూ ఇంట్రస్టింగ్ వీడియోలను షేర్ చేస్తుంటారు. ప్రతి వీకెండ్లో ఆయన నుంచి ఏదో ఒక బెస్ట్ వీడియో వస్తుంది. ఇప్పటికే ఆయన చాలా వీడియోలతో నెటిజన్లకు దగ్గరయ్యారు. తాజాగా ఈ మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్... ఓ ఏనుగు వీడియోను షేర్ చేశారు. షాకింగ్ విషయమేంటంటే... ఆ ఏనుగును టార్గెట్ చేస్తూ... పొదల్లో ఓ పెద్ద పులి ఉంది. మొత్తం 59 సెకండ్ల ఈ వీడియో నెటిజన్లకు బాగా నచ్చుతోంది. ఇలాంటి దృశ్యాలు అడవుల్లోనే ఉంటాయి. ఇది మాత్రం అడవిలోది కాదు. "ఈ మధ్య నా సోదరి కర్ణాటకలోని కూర్గ్ వెళ్లారు... అక్కడి నాగర్ హోల్ రిజర్వ్‌లో ఆమె ఈ వీడియో షూట్ చేశారు" అని ఆనంద్ మహీంద్రా ఈ వీడియో ట్వీట్లో తెలిపారు.
వీడియోని మామూలుగా చూస్తే... పొదల్లో పులి ఉన్నట్లు కనిపించదు. కానీ... కెమెరా జూమ్ చేసినప్పుడు చూస్తే పులి స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా మన వెనక ఓ పులి ఉంటే... మనకు ఎంత టెన్షన్‌గా ఉంటుంది. ఆ పులి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఏనుగుపై దాడి చేద్దామని ఎదురుచూస్తోంది. దాని కళ్లను చూడండి... ఎంత నిశితంగా చూస్తోందో మీకే అర్థమవుతుంది.
ఈ వీడియోను తీసిన కెమెరామేన్ ముందుగా... ఏనుగునే తీసాడు. కొన్ని సెకండ్ల తర్వాత పొదల్లో దాక్కున్న పులి కనిపించింది. వెంటనే ఫోకస్‌ను దాని పైకి షిఫ్ట్ చేశాడు.
డిసెంబర్ 19న పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు 44వేల వ్యూస్ వచ్చాయి. చాలా మంది మహీంద్రా అభిమానులు, ఫాలోయర్స్ ఈ వీడియోని చూసి భలే ఉంది అంటున్నారు. కొంత మంది ఈ జంతువులు ఎక్కడున్నదో చెప్పకూడదనీ... అలా చెబితే... వేటగాళ్లు చంపేస్తారని అన్నారు. ఇకపై ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తే... లొకేషన్ ఎక్కడో చెప్పొద్దని ఓ యూజర్ కోరారు.
ఇది కూడా చదవండి:Varanasi: ఆ గుడిలో దేవుడికి చాక్లెట్లు, బిస్కెట్లు, మాంసం, మద్యమే నైవేద్యం.
పులి కళ్లు చాలా పవర్ఫుల్. ఎప్పుడైనా సరే... ఎవరైనా సరే పులి కళ్లలో కళ్లు పెట్టి చూడకూడదు. ఎందుకంటే... దాని కళ్లకు ఇతరుల్ని వశీకరణం చేసుకునే గుణం ఉంటుంది. అంటే... మాయలూ మంత్రాలు ఉండవుగానీ... పులి కళ్లలోకి చూస్తున్నప్పుడు అది క్రమంగా మనుషుల దగ్గరకు వచ్చేస్తుంది. కానీ ఆ కళ్లను చూసేవాళ్లు... ఆ విషయాన్ని గ్రహించలేరు. ఎందుకంటే... దాని కళ్లు, రౌండ్ ఫేస్, నల్ల చారలు... అన్నీ కలిసి... చూసేవాళ్లకు మెస్మరైజ్ చేస్తాయి. దాంతో... దాడి చేయబోతోందనే విషయాన్ని మర్చిపోతారు. పైగా ఎవరైనా తనను తీక్షణంగా చూస్తే... తనపై దాడి చేయబోతున్నారని పులి భావిస్తుంది. అందుకే అది రివర్సులో ముందుగానే దాడి చేస్తుంది. అందువల్ల పులిని చూసేవారు... మధ్యమధ్యలో దిక్కులు చూడాలి. అప్పుడు అది హాని చెయ్యదంటున్నారు వైల్ లైఫ్ నిపుణులు. ఈ వీడియోలో కూడా పులి కళ్లు మెరుస్తున్నాయి. మొత్తానికి ఆ పులి ఈ ఏనుగును ఏమీ చేయలేదని తెలిసింది.
Published by:Krishna Kumar N
First published:December 22, 2020, 12:19 IST