శనివారం ఉదయం 8 గంటలకు మహారాష్ట్రాలోని తడోబా అభయారణ్యం(Tadoba Forest)లో గత కొద్ది రోజులుగా అటవీశాఖ అధికారులు పులుల గణన చేపట్టారు. ఈ క్రమంలో శనివారం కొంతమంది అటవీశాఖ సిబ్బంది, అటవీ కూలీలు కోలారా గేట్ వద్ద ఉన్న 97వ కోర్ జోన్కు వెళ్లారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఓ పులి(Tiger Attack) వారిపై దాడి చేసింది. అటవీశాఖ మహిళా ఉద్యోగి స్వాతి ధోమనే(43) పై దాడి చేసి ఆమెను పొదల్లోకి తీసుకువెళ్లింది.
అయితే పులి దాడి చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న అటవీ శాఖ సిబ్బంది సైతం వెంబడించినప్పటికీ పులి ఆమెను వదిలిపెట్టలేదు. పొదల్లోకి తీసుకొని వెళ్లడంతో అప్రమత్తమైన సిబ్బంది సైతం ఏమి చేయలేకపోయారు. దీంతో ఘటన సమాచారాన్ని అందుకున్న తడోబా మేనేజ్మెంట్ అధికారి,మిగతా ఇతర సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. దీంతో అడవిలోని దట్టమైన పొదల ప్రాంతంలో స్వాతి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. దీంతో మిగతా అధికారులు సైతం అప్రమత్తై అక్కడి నుండి వెళ్లిపోయారు.
ఇది చదవండి : ఆస్తికోసం భర్తను , భార్య ఏం చేసిందంటే.. ?
కాగా ఇటివల తెలంగాణ రాష్ట్రంలో కూడా అటవీ ప్రాంతాల్లోని పులుల సంచారం అధికమైంది. దీంతో స్థానికులు పులలు సంచారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్లో పశువుల పై ఓ పులి దాడి చేసింది. దీంతో అక్కడికక్కడే మూడు పశువులు మృతి చేందాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maharashtra, Tiger Attack