దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. 5 రోజులుగా దాదాపు అన్ని ప్రాంతాలు తడిసి ముద్దవుతున్నాయి. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులతో నీటితో నండి కళకళలాడుతున్నాయి. ఐతే ఈ వానలు మరిన్ని రోజులు కొనసాగుతాయని ఇప్పటికే భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ క్రమంలో రాబోయే ఒకటి రెండు గంటల్లో ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడతుందని వెల్లడించింది. ఢిల్లీతో పాటు నోయిడా, గ్రేటర్ నోయిడా, రోహతక్, గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, పల్వాల్, పానిపట్, కర్నాట్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది.
Thunderstorm with light to moderate intensity rain would occur (continue to occur) over & adjoining areas of most places of Delhi, Noida, Greater Noida, Rohtak, Gurugram, Ghaziabad, Faridabad, Palwal, Panipat & Karnal during the next 2 hours: India Meteorological Department pic.twitter.com/ktftwBYOIL
— ANI (@ANI) August 13, 2020
అటు ఏపీ సహా ఇతర రాష్ట్రాలకు మళ్లీ వాన గండం పొంచి ఉంది. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాగల 4 రోజులపాటు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అలలు 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉందని తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల శాఖ కమిషనర్ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.