హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Manuscripts: తాళపత్ర గ్రంథాల కోసం క్లినిక్.. స్పెషల్ ట్రీట్‌మెంట్‌ ఇవ్వనున్న అధికారులు..!

Manuscripts: తాళపత్ర గ్రంథాల కోసం క్లినిక్.. స్పెషల్ ట్రీట్‌మెంట్‌ ఇవ్వనున్న అధికారులు..!

Palm Leaf Manuscripts (PC : EPS)

Palm Leaf Manuscripts (PC : EPS)

Manuscripts: 1980వ సంవత్సరంలో చేపట్టిన ఒక సర్వే ప్రకారం, సుమారు 20 వేల తాళపత్ర గ్రంథాలు వివిధ క్షత్రియ కుటుంబాలకు చెందిన 'కోవిలాకోములు (Kovilakoms)', నంబూద్రి బ్రాహ్మణుల 'మానాలు (Manas)' వంటి పాత ఇళ్లలో ఉన్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పురాతన చరిత్రల గుట్టువిప్పే తాళపత్రాల కోసం క్లినిక్ ఉండటం తప్పనిసరి అంటున్నారు తుంచన్ మాన్యుస్క్రిప్ట్స్ రిపాజిటరీ అధికారులు. కేరళ (Kerala)లోని కాలికట్ యూనివర్సిటీ (Calicut University)కి అనుబంధంగా ఉన్న తుంచన్ మాన్యుస్క్రిప్ట్స్ రిపాజిటరీ (Thunchan Manuscripts Repository) ఇప్పుడు ఒక క్లినిక్ అభివృద్ధి చేసే ఆలోచన చేస్తోంది. పాతకాలంనాటి తాళపత్ర గ్రంథాలను సంరక్షించే ప్రయత్నంలో భాగంగా దీనిని తీసుకురావాలని యోచిస్తోంది. ఇక్కడి అధికారులు ఆ గ్రంథాలకు ప్రత్యేక చికిత్స (Special Treatment) అందించనున్నారు.

ఈ రిపాజిటరీ అధికారులు ప్రజలు తెచ్చే తాళ పత్రాలను భద్రపరచడం కోసం వాటికి నిమ్మ గడ్డి నూనె (Lemon Grass Oil)ను పూస్తూ ప్రథమ చికిత్సను అందిస్తున్నారు. ఇప్పుడు అదే సేవను శాశ్వతంగా ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో పర్మినెంట్ క్లినిక్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని రిపాజిటరీ డైరెక్టర్ ఎం.పీ మంజు ఆదివారం తెలిపారు. "తాళపత్ర గ్రంథాల పరిరక్షణపై ప్రజలు నిపుణుల అభిప్రాయాన్ని పొందగలిగే ప్రదేశంగా క్లినిక్‌ని ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ భావిస్తోంది" అని ఆమె చెప్పారు.

* 20,000 తాళపత్రాలు

1980వ సంవత్సరంలో చేపట్టిన ఒక సర్వే ప్రకారం, సుమారు 20 వేల తాళపత్ర గ్రంథాలు వివిధ క్షత్రియ కుటుంబాలకు చెందిన 'కోవిలాకోములు (Kovilakoms)', నంబూద్రి బ్రాహ్మణుల 'మానాలు (Manas)' వంటి పాత ఇళ్లలో ఉన్నాయి. వారిలో చాలా మంది ఈ గ్రంథాలను ఇతరులకు అప్పగించేందుకు తీవ్ర విముఖత చూపుతున్నారు. ఇవి చాలా పాతవి కాబట్టి రోజులు గడుస్తున్న కొద్దీ బాగా దెబ్బ తిని ఉండొచ్చు.

కొన్ని కుటుంబాలు వీటిని కోల్పోయి కూడా ఉండవచ్చు. క్షత్రియుల, బ్రాహ్మణుల పాత ఇళ్లలోని చాలా వరకు ఇళ్లు ధ్వంసం చేశారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఇళ్లను ఎక్కువకాలం కూలిపోకుండా కాపాడటం కష్టం. అందుకే ఇళ్లను ఖాళీ చేసి కూల్చేస్తున్నారు. ఈ క్రమంలో తాళపత్ర గ్రంథాలు భూగర్భంలో కలిసిపోయి ఉండవచ్చు.

ఇది కూడా చదవండి : ఇదేందయ్యా ఘోరం : రూ.37 లక్షల ఆదాయపు పన్ను కట్టాలని రోజువారీ కూలీకి నోటీసులు

ప్రస్తుతం తుంచన్ మాన్యుస్క్రిప్ట్స్ రిపాజిటరీ 8,000 పైగా తాళపత్ర గ్రంథాలను భద్రపరుస్తోంది. వాటిలో 1719లో రచించిన తంత్రసముచ్చయ కాపీ కూడా ఉండటం విశేషం. దేవాలయాలు, రాజ కుటుంబాల నుంచి కలెక్ట్ చేసిన గ్రంథాలు కూడా వీటిలో ఉన్నాయి.

క్లినిక్‌ను ప్రారంభిస్తే తాళ పత్రాలను సంరక్షించాలని భావించే వ్యక్తులు తమ వద్దకు వచ్చేలా ప్రోత్సహించినట్లు అవుతుందని యూనివర్సిటీ అధికారులు భావిస్తున్నారు. వారు రీఫర్బిష్డ్ గ్రంథాల డిజిటల్ కాపీలను సేవ్ చేసే ఆప్షన్ తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వైస్ ఛాన్సలర్ ఎం.కె. జయరాజ్ ఆగస్టు 23న పామ్ లీవ్స్ క్లినిక్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: History, Kerala, National News

ఉత్తమ కథలు