Home /News /national /

Coronavirus: జైళ్ల శాఖ సంచలన నిర్ణయం.. 3వేల మంది తీహార్ ఖైదీల విడుదల

Coronavirus: జైళ్ల శాఖ సంచలన నిర్ణయం.. 3వేల మంది తీహార్ ఖైదీల విడుదల

తీహార్ జైలు(File)

తీహార్ జైలు(File)

జైళ్ల శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా తీహార్ జైలు నుంచి 3వేల మంది ఖైదీలను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

  కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా జైళ్ల శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా తీహార్ జైలు నుంచి 3వేల మంది ఖైదీలను విడుదల చేసేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖైదీలతో పాటుజైలు సిబ్బంది, సందర్శకులు, న్యాయవాదులకు కూడా కరోనా ముప్పు పొంచి ఉంది. జైళ్లలోని ఖైదీలకు కోవిడ్-19 సోకే అవకాశముందనే వాదనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. అయితే ఏడు సంవత్సరాల వరకు శిక్షపడే అవకాశమున్న ఖైదీలను విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే తీహార్ జైలు నుంచి 3వేల మంది విడుదల చేయనున్నారు.

  జైళ్ల శాఖ డైరెక్టర్ జనలర్ సందీప్ గోయల్ దీనిపై స్పందిస్తూ.. 1500 మంది అండర్ ట్రయల్ ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై, మరో 1500 మంది ఖైదీలను పెరోల్‌పైన వచ్చే మూడు నాలుగు రోజుల్లో విడుదల చేయనున్నట్టు తెలిపారు. అయితే విడుదల కానున్న ఖైదీల్లో కరుడుగట్టిన నేరగాళ్లు, తీవ్ర నేరాలకు పాల్పడిన వారిని విడుదల చేయడంలేదని పేర్కొన్నారు. అయితే వీరిని నాలుగు నుంచి ఆరు వారాల పాటు పెరోల్‌పై విడిచిపెట్టే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
  Published by:Narsimha Badhini
  First published:

  Tags: Jail, Supreme Court, Tihar

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు