జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం.. కొనసాగుతున్న వేట

దేశంలో అసాంఘీక శక్తులను ఏరివేసేందుకు భారత బలగాలు కృషి చేస్తున్న క్రమంలో ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటివరకు 100 మంది ఉగ్రవాదులను పైగా హతమార్చారు.

news18-telugu
Updated: June 29, 2020, 7:25 AM IST
జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం.. కొనసాగుతున్న వేట
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. గత కొద్ది రోజులుగా వరుసగా ఉగ్రవాదులను భద్రత దళాలు మట్టుబెట్టాయి. ప్రధానంగా లాక్‌డౌన్ ప్రారంభం నుంచి నిత్యం ఎక్కడో ఒకచోట ఉగ్రవాదుల కదలికలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే దక్షిణ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు ఉగ్రవాదులను పూర్తిగా అంతమొందించాయి. దేశంలో అసాంఘీక శక్తులను ఏరివేసేందుకు భారత బలగాలు కృషి చేస్తున్న క్రమంలో ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటివరకు 100 మంది ఉగ్రవాదులను పైగా హతమార్చారు. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ ప్రాంతంలో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.

ఖుల్‌చోహర్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సైన్యానికి పక్కా సమాచారం రావడంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది గాలించారు. గాలింపు చేపట్టిన బలగాలను గమనించిన ముగ్గురు ఉగ్రవాదులు బలగాలపైకి కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఎదురు కాల్పులు చేసి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ కాల్పులు మొదలైన గంటలోపే ముగ్గురు ఉగ్రవాదులను చంపేసినట్టు అధికారులు పేర్కొన్నారు. మరికొంతమంది ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు తెలుస్తోంది. వారి కోసం బలగాలు వేట కొనసాగిస్తున్నాయి.
First published: June 29, 2020, 7:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading