జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం.. సైన్యం రాంబన్ ఆపరేషన్ సక్సెస్..

శనివారం ఉదయం బటోటే ప్రాంతంలో మొదట ఓ బస్సును ఆపేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు.అప్రమత్తమైన డ్రైవర్ బస్సు స్పీడ్ పెంచాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మిలటరీకి సమాచారం అందించారు.

news18-telugu
Updated: September 28, 2019, 5:23 PM IST
జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం.. సైన్యం రాంబన్ ఆపరేషన్ సక్సెస్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జమ్మూకశ్మీర్‌లోని రాంబన్‌లో ఒక ఇంట్లో నక్కిన ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.ఇందులో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా కూడా ఉండటం గమనార్హం. దాదాపు 12 గంటల పాటు సాగిన ఆపరేషన్‌లో ఉగ్రవాదుల చేతిలో బంధీలుగా ఉన్నవారిని సురక్షితంగా విడిపించారు.అయితే ఈ ఆపరేషన్‌లో ఒక భారత జవాన్ అమరుడవగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఆపరేషన్ అనంతరం జవాన్లు విజయ నినాదాలు చేశారు.

శనివారం ఉదయం బటోటే ప్రాంతంలో మొదట ఓ బస్సును ఆపేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు.అప్రమత్తమైన డ్రైవర్ బస్సు స్పీడ్ పెంచాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మిలటరీకి సమాచారం అందించారు.దీంతో బటోటే ప్రాంతంలో జవాన్లు భారీగా మోహరించారు. ఆ సమయంలో క్విక్ రియాక్షన్ టీమ్‌పై గ్రెనేడ్ దాడికి యత్నించగా.. సైన్యం తిప్పికొట్టింది. దీంతో ఉగ్రవాదులు రాంబన్‌‌లోని ఓ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్నవారిని బంధీలుగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం భారత జవాన్లు ఆ ఇంటిని చుట్టుముట్టారు. లొంగిపోవాలని తొలుత హెచ్చరికలు జారీ చేసినా..ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భారత సైన్యం కూడా కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.ఉగ్రవాదుల చెరలో ఉన్న ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

కాగా, గురువారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ దేశంలోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని మిలటరీని అప్రమత్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో దోవల్ పర్యటించడం ఇది రెండోసారి. మొత్తం మీద దోవల్ ఆదేశాలతో అప్రమత్తమైన భారత సైన్యం శనివారం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
Published by: Srinivas Mittapalli
First published: September 28, 2019, 5:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading