కేజీఎఫ్‌లో ప్రమాదం.. బంగారం చోరీకి వెళ్లి ఊపిరాడక దొంగలు మృతి

బావి గుంతను గాలించగా స్కంద, జోసెఫ్ మృతదేహాలు లభించాయి. పడయప్ప మృతదేహం మాత్రం ఇప్పటికీ దొరకలేదు. గురువారం ఉదయం కూడా బోర్ వెల్ మెసీన్లు, టార్చ్‌లైట్లతో వెతికారు.

news18-telugu
Updated: May 14, 2020, 3:26 PM IST
కేజీఎఫ్‌లో ప్రమాదం.. బంగారం చోరీకి వెళ్లి ఊపిరాడక దొంగలు మృతి
కేజీఎఫ్‌లో ప్రమాదం.. బంగారం చోరీకి వెళ్లి ఊపిరాడక దొంగలు మృతి
  • Share this:
కర్నాటకలోని కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం వాడుకలో లేని ఓ గనిలోకి రహస్యంగా వెళ్లిన ముగ్గురు దొంగలు చనిపోయారు. చాలా లోతుకు వెళ్లడంతో ఊపిరాడక అక్కడికక్కడే మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేజీఎఫ్‌కు చెందిన స్కంద (55), జోసెఫ్ (45) పాటు మరో ముగ్గురు కలిసి BGML (భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్) కంపెనీకి వెళ్లారు. చాలా ఏళ్లుగా ఇది మూతపడి ఉంది. ఐతే గనుల లోపల ఇప్పటికీ ముడి బంగారం ఉందని ఎంతో మంది దొంగతనానికి వెళ్లిన ఘటనలు అక్కడ జరిగాయి. ఈ క్రమంలో ఈ ఐదుగురు కూడా బుధవారం బంగారం చోరీకి గని లోపలికి వెళ్లారు.

ముందుగా స్కంద, జోసెఫ్ తాడు సాయంతో లోతైన బావి గుంతలోకి దిగారు. ఆ తర్వాత మూడో వ్యక్తి కూడా లోపలికి దిగాడు. ఐతే ఊపిరాడకపోవడంతో పైకి లాగాల్సిందిగా మూడో వ్యక్తి బిగ్గరగా కేకలు వేశారు. పైనున్న ఇద్దరు వ్యక్తులకు అతడిని పైకి లాగారు. కిందకు వెళ్లిన ఇద్దరు వ్యక్తలు కనిపించడం లేదని చెప్పడంతో.. మిగతా వారు కంగారుపడ్డారు. వెంటనే స్కంద కుమారుడు పడయప్ప (25)కి ఫోన్ చేయడంతో.. హుటాహుటిన అతడు చేరుకున్నాడు. మీ తండ్రి ఆపదలో ఉన్నాడని చెప్పడంతో.. వెనకా ముందు ఆలోచించకుండా తాడు సాయంతో కిందకు వెళ్లాడు పడయప్ప.

కానీ ఆ తర్వాత ఎవరూ పైకి రాలేదు. ఎంత పిలిచినా స్పందించకపోవడంతో మిగిలిన ముగ్గురు పోలీసులకు సమాచారం అందించారు. వారు చేరుకొని.. అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బావి గుంతను గాలించగా స్కంద, జోసెఫ్ మృతదేహాలు లభించాయి. పడయప్ప మృతదేహం మాత్రం ఇప్పటికీ దొరకలేదు. గురువారం ఉదయం కూడా బోర్ వెల్ మెసీన్లు, టార్చ్‌లైట్లతో వెతికారు. కానీ ఎలాంటి ఫలితం లేదు. అక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొసాగుతోంది. పడయప్ప కోసం గనిని మొత్తం గాలిస్తున్నారు. కాగా, 2001 మార్చి 1న BGML మూతపడింది. ఆ తర్వాత గనుల్లో చోరీ జరిగిన ఘటనలు చాలానే ఉన్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: May 14, 2020, 3:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading