Home /News /national /

Gwalior: జాతీయ జెండా కడుతుండగా ప్రమాదం.. ముగ్గురు మున్సిపల్ కార్మికులు మృతి..ఏం జరిగిందంటే.

Gwalior: జాతీయ జెండా కడుతుండగా ప్రమాదం.. ముగ్గురు మున్సిపల్ కార్మికులు మృతి..ఏం జరిగిందంటే.

క్రేన్ కూలి ముగ్గురు ఉద్యోగులు మృతి

క్రేన్ కూలి ముగ్గురు ఉద్యోగులు మృతి

Independence Day 2021: మధ్యప్రదేశ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. గ్వాలియర్‌లో ఓ పోస్టాఫీసు భవనంపై జెండా ఏర్పాటు చేస్తుండగా క్రేన్ కూలిపోయి ముగ్గురు కార్మికులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

    రేపు భారత స్వాతంత్ర్య దినోత్సవం. యావత్ దేశం వేడుకలకు సిద్ధమవుతోంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ మున్సిపల్ కార్పొరేషన్ కూడా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. పోస్టాఫీస్ భవనంపై జాతీయ జెండా కడుతుండగా క్రేన్ కూలిపోయి ముగ్గురు మున్సిపల్ ఉద్యోగులు మరణించారు. స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి ఏటా చారిత్రక భవనాలను అందంగా అలంకరిస్తారు. ఈసారి కూడా మహారాజ్ బడా పోస్టాఫీసు భవనంపై జెండా ఏర్పాటు శనివారం మున్సిపల్ సిబ్బంది వెళ్లారు. కార్పొరేషన్‌కు చెంది హైడ్రాలిక్ ఫైర్ బ్రిగేడ్ ట్రాలీలో కూర్చుని పోస్ట్ ఆఫీస్ భవనంపై జెండాను ఏర్పాటుకు ప్రయత్నించారు. ఆ సమయంలో క్రేన్ ప్లాట్ ఫారమ్ ఒక్కసారిగా విరిగిపడింది. ఈ ఘటనలో ముగ్గురు ఉద్యోగులు అక్కడికక్కడే మరణించారు. క్రేన్ నడుపుతున్న డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    మున్సిపల్ కార్మికుల మృతిపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ట్వీట్ చేశారు.



    ''గ్వాలియర్‌లోని మహారాజ్ బడా స్థితి పోస్టాఫీసు భవనంపై జాతీయ జెండా ఏర్పాటు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు మున్సిపల్ కార్మికులు మరణించడం, మరో ముగ్గురు కార్మికులు గాయపడ్డారన్న వార్త నన్ను ఎంతగానో బాధించింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.'' అని శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత కమల్ నాథ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

    ఇవి కూడా చదవండి:

    Terrorists: పాకిస్తాన్ నుంచి బాంబులతో డ్రోన్లు.. రేపు పలు చోట్ల ఉగ్రదాడులకు భారీ కట్ర.. నలుగురు అరెస్ట్

    Independence Day 2021: త్రివర్ణ పతాకం గురించి 13 ఆసక్తికర విషయాలు.. తప్పక తెలుసుకోండి
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Independence Day, Independence Day 2021, Madhya pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు