Home /News /national /

THREE MAOISTS KILLED IN SECURITY FORCES FIRING IN MADHYA PRADESH SNR KMM

Encounter: మధ్యప్రదేశ్‌లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ .. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు దళసభ్యులు మృతి

(ఎన్‌కౌంటర్)

(ఎన్‌కౌంటర్)

Encounter: మధ్యప్రదేశ్‌లో మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది. మహరాష్ట్ర బోర్డర్‌లో కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు దళ సభ్యులు చనిపోయారు.

(G.SrinivasReddy,News18,Khammam)
మధ్యప్రదేశ్(Madhya Pradesh)దండకారణ్యంలో మకాం వేసిన మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు నిత్యం భద్రత దళాలు కూంబింగ్‌ నిర్వహిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌(Balaghat)జిల్లా బహేలా(Bahela)పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో మావోయిస్టులు, భద్రత దళాల మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు భద్రత దళాల తూటాలకు బలైపోయారు. మృతి చెందిన ముగ్గురు మావోయిస్టుల్లో ఒక మహిళా దళ సభ్యురాలు కూడా ఉన్నట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి (Home Minister)నరోత్తమ్‌ మిశ్రా(Narottam Mishra) తెలిపారు.

మావోయిస్ట్‌లకు గట్టి దెబ్బ..
మధ్యప్రదేశ్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బాలాఘాట్ జిల్లా లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం మావోయిస్టులు సంచరిస్తున్నట్లుగా సమాచారం రావడంతో భద్రత దళాలు కూంబింగ్ నిర్వహించాయి. అదే క్రమంలో మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు కూంబింగ్ నిర్వహిస్తున్న భధ్రత దళాలపై కాల్పులు జరపడంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన ముగ్గురు మావోయిస్టులు కీలకమైన వ్యక్తులు గుర్తించారు. ముగ్గురిపై 30లక్షల నగదు రివార్డ్ కూడా ఉన్నట్లు మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. మృతి చెందిన ముగ్గురు దళ సభ్యుల్లో డివిజనల్ కమిటీ సభ్యుడు నగేష్‌, ఏరియా కమాండర్ మనోజ్‌తో పాటు రమే అనే మహిళా మావోయిస్ట్‌ సభ్యురాలు ఉన్నట్లుగా తెలిపారు. నగేష్‌పై 185లక్షల రివార్డు, మనోజ్, రమేపై చెరో 8లక్షల రివార్డు ఉన్నట్లుగా పోలీసులు ప్రకటించారు.



బోర్డర్‌లో ఎన్‌కౌంటర్..
సోమవారం ఉదయం మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ఈ ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో భద్రత దళాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టులు భద్రత దళాల్ని మట్టుపెట్టేందుకు జరిపిన కాల్పుల వల్లే పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ముగ్గురు మావోయిస్టుల మృతితో కొద్ది రోజులుగా మధ్యప్రదేశ్, మహరాష్ట్రలో ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న మావోయిస్టు పార్టీకి భద్రత దళాలు గట్టి దెబ్బకొట్టినట్లైంది. అంతే కాదు లోదంగి అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు.

ఇది చదవండి: ‘అగ్నిపథ్ పథకం ఆందోళనలు’.. కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..



పక్కా సమాచారంతోనే ..
లంజీ హెడ్‌క్వార్టర్స్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహేలా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కడ్లా గ్రామంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. కాల్పులు జరిగిన ప్రదేశంలో ఏకే47తో పాటు మరికొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో మావోయిస్టులు తిష్టవేసినట్లుగా తమకు స్పష్టమైన సమాచారం వచ్చిందని అందుకే కూంబింగ్ నిర్వహించామని సీనియర్‌ పోలీసు అధికారులు తెలిపారు. మావోయిస్టులను లొంగిపోవాలని కోరినప్పటికి వినకపోవడంతో పాటు పోలీస్‌ బృందంపై కాల్పులు జరపడం వల్లే ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Encounter, Madhra pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు