దంతేవాడలో ఎన్‌కౌంటర్ ముగ్గురు మావోయిస్టుల హతం..!

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయుధాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

news18-telugu
Updated: October 3, 2018, 1:22 PM IST
దంతేవాడలో ఎన్‌కౌంటర్ ముగ్గురు మావోయిస్టుల హతం..!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దంతేవాడ సుకుమా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. సుకుమా జిల్లా సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా... పలువురు నక్సల్స్ గాయాలపాలైనట్లు తెలుస్తుంది. పోలీసులు మావోయిస్టు మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఒకరు బతికి ఉన్నట్లుగా గుర్తించారు. పుల్‌బగ్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయుధాల్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సుకుమా ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు.
Published by: Sulthana Begum Shaik
First published: October 3, 2018, 1:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading