THREE INDIAN NAVY PERSONNEL KILLED IN EXPLOSION ONBOARD INS RANVIR AT MUMBAI NAVAL DOCKYARD MKS
INS Ranvir: భారత యుద్ధనౌకలో పేలుడు.. ముగ్గురు నేవీ సిబ్బంది దుర్మరణం..
ఐఎన్ఎస్ రణవీర్ యుద్ధనౌక(పాత ఫొటో)
ప్రతిష్టాత్మక ఐఎన్ఎస్ రణవీర్ యుద్ధనౌక లోపలి భాగంలో పేలుడు సంభవించడంతో ముగ్గురు నేవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో మంగళవరం జరిగిందీ ఘటన.
ఇండియన్ నేవీకి సంబంధించి అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ప్రతిష్టాత్మక ఐఎన్ఎస్ రణవీర్ యుద్ధనౌక లోపలి భాగంలో పేలుడు సంభవించడంతో ముగ్గురు నేవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు నేవీ అధికారులు మంగళవరం రాత్రి ప్రకటించారు. యుద్ధనౌక అంతర్గత కంపార్ట్మెంట్లో పేలుడు వల్ల ముగ్గురు సిబ్బంది చనిపోయారని, వెంటనే స్పందించిన ఇతర సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారని ఇండియన్ నేవీ అధికారులు చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
INS రణవీర్ యుద్ధ నౌక తూర్పు నావికాదళ కమాండ్ నుంచి క్రాస్ కోస్ట్ కార్యాచరణలో నిమగ్నమై ఉందని, అది బేస్ పోర్టుకు తిరిగి రావాల్సి ఉండగా అనూహ్యరీతిలో పేలుడు సంభవిచిందని నేవీ అధికారులు చెప్పారని ఏఎన్ఐ తెలిపింది. అసలీ ఘటన ఎలా జరిగిందో కారణాలు కనిపెట్టేందుకు విచారణ కమిటీని కూడా నేవీ నియమించినట్లు సమాచారం.
భారత నౌకాదళం కోసం నిర్మించిన ఐదు రాజ్‌పుత్-తరగతి డిస్ట్రాయర్లలో INS రణవీర్ నాల్గవది. రణవీర్ 28 అక్టోబర్ 1986న కమీషన్ అయింది. గడిచిన 35 ఏళ్లుగా రణవీర్ నేవీలో కీలక భూమిక పోషిస్తోంది. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.