కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం..

జమ్మూ కాశ్మీర్‌లో సోఫియాన్ జిల్లాల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జిల్లాలోని వాచ్చి ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో...

news18-telugu
Updated: January 20, 2020, 1:16 PM IST
కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జమ్మూ కాశ్మీర్‌లో సోఫియాన్ జిల్లాల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జిల్లాలోని వాచ్చి ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించగా.. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు చేసి, ముగ్గుర్ని అంతమొందించారు. ఈ మేరకు కాశ్మీర్ జోన్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ముగ్గురు ఉగ్రవాదులు హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందినవారని వెల్లడించారు. ముగ్గురిలో ఒకతను ఆదిల్ అహ్మద్‌గా గుర్తించారు. మిగితా ఇద్దరి గురించి తెలియరాలేదు.
Published by: Shravan Kumar Bommakanti
First published: January 20, 2020, 1:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading