పెళ్లితో ఒక్కటైన మూడు HIV జంటలు... కలకాలం జీవించమని దీవించిన పెద్దలు...

ఆ పెళ్లి కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ఆనంద భాష్పాలు రాలాయి. అందరూ ఆ జంటల్లా జీవితాన్ని పాజిటివ్ కోణంలో చూడాలని ఆశీర్వదించారు.

news18-telugu
Updated: July 7, 2020, 9:42 AM IST
పెళ్లితో ఒక్కటైన మూడు HIV జంటలు... కలకాలం జీవించమని దీవించిన పెద్దలు...
పెళ్లితో ఒక్కటైన మూడు HIV జంటలు... కలకాలం జీవించమని దీవించిన పెద్దలు...
  • Share this:
ఎయిడ్స్ HIV పేషెంట్లను మొదటి నుంచి మన సమాజం చిన్న చూపు చూస్తూనే ఉంది. కానీ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో మాత్రం... మూడు HIV పాజిటివ్ జంటలు పెళ్లితో ఒక్కటై... సరికొత్త జీవితాన్ని ప్రారంభించాయి. ఈ పెళ్లికి వచ్చిన వారంతా... వాళ్లను ఆశీర్వదిస్తూ... ఆనందభాష్పాలు రాల్చారు. జిల్లా యంత్రాంగమే కన్యాదాన కార్యక్రమం నిర్వహించి... పాలీలోని ఆనందవనంలో పెరిగిన ముగ్గురు యువతులకు ఉన్నంతలో ఘనంగా పెళ్లి చేశారు. ఈ ముగ్గురు యువతులకీ HIV ఉండటం వల్ల వీరికి పెళ్లి కావట్లేదు. ఎవరి జీవితంలోనైనా పెళ్లి కాకపోవడం అనేది ఎంతో ఇబ్బందికరమైన అంశం. ఐతే... ఈ జంటలు మాత్రం భవిష్యత్తుపై పాజిటివ్ ఆలోచనలను చెదరనివ్వలేదు. ఇప్పుడు తమ కొత్త భాగస్వాములతో... కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.

Three HIV Positive Couple, maharashtra news, hiv couple, hiv marriage, maharashtra government, beed district, telugu news, telugu varthalu, మహారాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఐవీ జంటలు, మహారాష్ట్ర న్యూస్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్,
పెళ్లితో ఒక్కటైన మూడు HIV జంటలు... కలకాలం జీవించమని దీవించిన పెద్దలు...


ఇందులో ఓ జంట... 13 ఏళ్లుగా... ఆనందవనంలో HIV పేషెంట్లకు సేవ చేస్తోంది. మరో జంటకు బాబా ఆమ్టే అంటే ఆదర్శం. ఈ జంట ఇంతకుముందు... మరో ముగ్గురు యువతులకు పెళ్లి అయ్యేందుకు సాయం చేసింది.

దీర్ఘకాలిక వ్యాధి ఉందనే కారణంతో... ఈ జంటలకు సమాజంలో ఎలాంటి విపక్షా చూపకూడదని ఈ కార్యక్రమానికి వచ్చిన బీడ్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్... హర్ష పొదార్ తెలిపారు. వారు ఎలా జీవించాలో సూచించాలని చెప్పారు.

జాహ్నవీ భట్కర్, సురేష్ జాదవ్.
Published by: Krishna Kumar N
First published: July 7, 2020, 9:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading