కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎంపీ ఇంటి బయట మూడు నాటు బాంబులు పేలిన ఘటన కలకలం రేపింది. మంగళవారం రాత్రి బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి సమీపంలో నాటు బాంబులు పేలాయి. ఆ సమయంలో ఎంపీ అర్జున్ సింగ్ ఆ ఇంట్లో లేరు. ఢిల్లీలో ఉన్నట్లు తెలిసింది. అయితే.. ఆయన కుటుంబ సభ్యులు ఘటన జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.
బాంబు పేలుళ్ల శబ్దంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటన గురించి సమాచారం అందుకుని స్పాట్‌కు వెళ్లి పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని.. ఈ పేలుళ్ల వెనుక కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఎంపీ ఇంటి బయట నాటు బాంబులు పేలిన ఘటనపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్ ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ ఇంటి వెలుపల బాంబు పేలిన ఘటన భయాందోళనకు గురి చేసిందని ఆయన ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్ పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని గవర్నర్ జగ్దీప్ ట్వీట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Bomb attack, Mamata Banerjee, West Bengal