కమల్ హాసన్‌పై 3 కేసులు నమోదు... హిందూ ఉగ్రవాది వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం...

Kamal Haasan : గాడ్సే తొలి హిందూ ఉగ్రవాది అంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై హిందుత్వ వాదులు తీవ్రంగా మండిపడుతున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 15, 2019, 7:46 AM IST
కమల్ హాసన్‌పై 3 కేసులు నమోదు... హిందూ ఉగ్రవాది వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం...
కమల్ హాసన్ (Image : Twitter)
  • Share this:
స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది హిందువు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధినేత కమల్ హాసన్‌పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అరవకురిచి పోలీస్ స్టేషన్‌లో కమల్ హాసన్‌పై ఐపీసీలోని సెక్షన్లు 153A, 295A కింద కేసు నమోదు చేశారు. మతం, కులం, భాష, జాతి పేరుతో హింసను ప్రేరేపిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కమల్ హాసన్‌కి వ్యతిరేకంగా ఢిల్లీలో కూడా రెండు కేసులు నమోదయ్యాయి. కమల్ హాసన్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత, లాయర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్... ఢిల్లీ హైకోర్టులో పిల్ వేశారు. ఆయన 5 రోజుల పాటు ఎన్నికల్లో ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని ఈసీని కోరారు. కమల్ హాసన్‌పై దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో హిందూ సంస్థలు కమల్ హాసన్‌కి వ్యతిరేకంగా అక్కడి కోర్టుల్ని ఆశ్రయించాయి.

ఎప్పుడూ హిందూత్వ పార్టీలపై విరుచుకుపడే కమల్ హాసన్ ఈసారి కూడా అదే చేశారు. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే తొలి భారత ఉగ్రవాది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవకురిచి అసెంబ్లీ స్థానానికి వచ్చే ఆదివారం ఉపఎన్నిక జరగబోతోంది. ఆ సందర్భంగా MNM పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేసిన కమల్ హాసన్... సరికొత్త వివాదానికి తెరతీశారు. ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వారిని ఆకర్షించేందుకు ఈ వ్యాఖ్యలు తాను చేయడం లేదనీ... వాస్తవాన్ని చెబుతున్నాననీ కమల్ హాసన్ అన్నారు.

కమల్ హాసన్ వ్యాఖ్యల్ని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకుడు సౌందర్‌రాజన్ తీవ్రంగా ఖండించారు. నాథూరామ్ గాడ్సే చేసిన నేరాన్ని మొత్తం హిందూ సమాజానికి అన్వయించడం తప్పు అని విమర్శించారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్... కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. కమల్ కామెంట్లపై ట్విట్టర్‌లో స్పందించిన వివేక్... ట్వీట్ చేశారు. ముస్లిం డామినేటడ్ ఏరియాలో కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఓట్ల కోసమేనని విమర్శించారు. గాడ్సేను ఉగ్రవాది అన్న మీరు ... హిందూ అన్న పదం ఎందుకు ప్రస్తావించారని కమల్‌ను ప్రశ్నించారు వివేక్ ఒబెరాయ్. దేశాన్ని విభజించవద్దని కోరారు.కమల్ హాసన్ నాలుక తెగ్గోయాలని తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ ఓట్ల కోసమే కమల్ హాసన్ ఆ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఎవరో ఒకరు చేసిన పనికి మొత్తం కమ్యూనిటీని నిందించడం సరికాదన్నారు. కమల్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కేఎస్ ఆళగిరి బీజేపీ మాత‌ృ సంస్థ ఆర్ఎస్ఎస్‌ను ఐసిస్‌తో పోల్చారు. ఇస్లాం పేరు చెప్పుకుని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ & సిరియా ఎలాగైతే తీవ్రవాద సంస్థగా మారిందో.. హిందూయిజం పేరుతో ఆర్ఎస్ఎస్ కూడా తీవ్రవాద సంస్థగా మారిందన్నారు. ఆర్ఎస్ఎస్, జనసంఘ్, హిందూ మహాసభ వంటి సంస్థలు తమ భావజాలాన్ని వ్యతిరేకించేవారిని అంతమొందించాలని చూస్తాయన్నారు. స్వతంత్ర భారత దేశంలో తొలి ఉగ్రవాది హిందువే అన్న మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ వ్యాఖ్యలను తాను 100శాతం కాదు, 1000శాతం సమర్థిస్తానని అన్నారు.

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మాత్రం కమల్ హాసన్‌కు అండగా నిలిచారు. జాతిపిత గాంధీని చంపిన గాడ్సేను మహాత్ముడంటారా? రాక్షసుండారా? అని ప్రశ్నించారు. గాడ్సే ఉగ్రవాదేనని స్పష్టంచేసిన అసద్... కమల్ వ్యాఖ్యలను సమర్థించారు. 

ఇవి కూడా చదవండి :

విచారణకు వస్తారా... అరెస్ట్ అవుతారా... నేడు తేలనున్న రవి ప్రకాష్ ఫ్యూచర్...

నేడు పులివెందులలో జగన్ ప్రజాదర్బార్... రాయలసీమలో వైసీపీ గెలుపుపైనా సమీక్ష..?

టీడీపీకి 110 సీట్లు... వైసీపీకి యూత్ ఓట్లు... చంద్రబాబు సర్వేల్లో తేలింది ఇదేనా..?

ఏపీలో బుకీలకు షాక్... బెట్టింగ్ రద్దు చేసుకుంటున్న ప్రజలు... ఐపీఎల్ ఎఫెక్ట్...
First published: May 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>