Delhi : అది ఢిల్లీలోని IIT రోడ్డు. టైమ్ ఉదయం 11.15 అయ్యింది. సరిగ్గా ఆ సమయంలో... ఓ ఒంటరి యువతి... రోడ్డుపై వెళ్తోంది. అప్పుడే చేతుల నిండా రంగులు పట్టుకొచ్చిన ముగ్గురు ఆవారాగాళ్లు... ఆమెకు బలవంతంగా రంగులు రాశారు. వాళ్లలో ఒకడు శారీరకంగా ఆమెను టీజ్ చేశాడు. ఆమె వద్దు వద్దంటున్నా రెచ్చిపోయారు. అప్పుడే అటుగా కాంగ్రెస్ నేత (ఆప్ మాజీ నేత) అల్కా లంబా కారులో వచ్చారు. యువతి అరుపులు విని ఆమె కారు స్లో చేశారు. అంతే... అక్కడి నుంచీ కుర్రాళ్లు జారుకున్నారు. కారు ఆపిన అల్కా లంబా... ఏం జరిగిందని యువతిని అడిగి తెలుసుకున్నారు. అరెరే అంటూ ఆమెను ఓదార్చారు. నువ్వు ధైర్యంగా ఉండు... వాళ్ల సంగతి నేను చెబుతా... అంటూ కారును వాళ్ల దగ్గరకు పోనిచ్చారు. ఆమెను చూసిన యువకులు... ఏంటి అంటూ ఆమెనే గద్దిస్తున్నారు. మద్యం తాగిన ఈ గాలి వెధవల్ని చూడండి... అంటూ వాళ్లు చేసిన నిర్వాకాన్ని వీడియో తీసి... ట్విట్టర్లో షేర్ చేశారు. అలాగే... ఢిల్లీ పోలీసులకు ట్యాగ్ చేశారు.
@DelhiPolice यह आज सुबह 11.15बजे
का मुनिरका IIT रोड का वीडियो है,
अकेली लड़की देख नशे में यह 3 लड़के उसे जबरन रंग लगा रहे थे और उससे शारीरिक रूप से छेडछाड कर रहे थे,जैसे ही मैंने उनके क़रीब जाकर अपनी गाड़ी रोकी,लड़की को तुरन्त छोड़ यह कुछ यूं हरक़त करने लगे.
दिल्ली सुरक्षित है? pic.twitter.com/yFhXvu61eU
— Alka Lamba - अलका लाम्बा🇮🇳 (@LambaAlka) March 10, 2020
ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. కొన్ని గంటల్లోనే దీన్ని 6వేల మందికి పైగా చూశారు. చాలా మంది అల్కా లంబాను మెచ్చుకుంటున్నారు. ఆవారాగాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. ఢిల్లీ పోలీసులు మరింత ఎక్కువ భద్రతా చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.