గుజరాత్‌లోని గిర్ అడవుల్లో ఆసియా సింహాల మరణమృదంగం కొనసాగుతోంది. గూడ్స్ రైలు ఢీకొని మూడు ఆసియా సింహాలు దుర్మరణం చెందాయి. ఇప్పటికే గిర్ అడవుల్లో గత రెండు నెలల్లోనే 23 సింహాలు వైరస్ కారణంగా చనిపోయాయి. ఇప్పుడు మరో మూడు సింహాలు రైలు ఢీకొని చనిపోవడం జంతు ప్రేమికుల్ని కలవరపరుస్తోంది. బోరాలా గ్రామంలోని రైల్వే ట్రాక్ దగ్గర మూడు సింహాల మృతదేహాలు కనిపించాయి.
ఆసియా సింహాలకు గుజరాత్ అడవులు కేరాఫ్ అడ్రస్. ఈ సింహాలు ఇండియాకే గర్వకారణం. యాభై ఏళ్ల క్రితం పదుల సంఖ్యలో మాత్రమే ఈ సింహాలు ఉండేవి. 2015 లెక్క ప్రకారం గిర్ అడవుల్లో 520 సింహాలున్నాయి. అయితే గిర్ అడవుల విస్తీర్ణం తక్కువగా ఉండటంతో ఈ సింహాలు నివసించేందుకు చోటు ఉండట్లేదన్న వాదన ఉంది. ఓవైపు దేశానికి గర్వకారణమైన ఆసియా సింహాల సంఖ్య పెరుగుతోందని సంతోషిస్తుంటే... సింహాలు ఇలా వరుసగా చనిపోవడం కలకలం రేపుతోంది. రెండు నెలల్లోనే 23 సింహాలు అనారోగ్యంతో చనిపోయాయి.
గిర్ అడవుల్లో గత రెండేళ్లలో 200 పైగా సింహాలు చనిపోయాయి. అన్నీ అసహజ మరణాలే. ఈ ఏడాది మార్చిలో సింహాల అసహజ మరణాల వ్యవహారాన్ని గుజరాత్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇక గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ లెక్క ప్రకారం 2017 డిసెంబర్ 31 నాటికి సింహాలు, చిరుతల్లాంటి 365 పెద్ద జంతువులు చనిపోయాయి.
ఇవి కూడా చదవండి:
#FlashBack2018: టాప్-10 మొబైల్ యాప్స్ ఇవే...
రెండు వారాల్లో మీ ఏటీఎం, క్రెడిట్ కార్డులు పనిచేయవు
రెడ్మీ నోట్ 6 ప్రో: రూ.999 ధరకే సొంతం చేసుకోండిలా...
LIC POLICY: రోజూ రూ.121 పొదుపుతో అమ్మాయి పెళ్లికి రూ.27 లక్షల రిటర్న్స్
వాట్సప్‌లో కొత్తగా 'పిక్చర్ ఇన్ పిక్చర్' మోడ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.