THOUSANDS OF INDIANS COVID 19 RELATED DATA LEAKED ONLINE PUT FOR SALE ON THE DARK WEB MKS
Data Leak: అమ్మకానికి భారతీయుల Covid డేటా.. ఫోన్ నంబర్, ఇంటి అడ్రెస్ సహా వివరాలన్నీ లీక్
ప్రతీకాత్మక చిత్రం
వైరస్ కంటే ప్రమాదకారులైన చీకటి బేహారులు భారతీయుల కొవిడ్ డేటాను బైట్ల లెక్కన అమ్మకానికి పెట్టారు. ప్రతి నిత్యం దేశంలో లక్షలాది కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం పౌరులు ఫోన్ నంబర్లు, ఇంటి అడ్రస్ తప్పనిసరిగా ఇస్తోన్న దరిమిలా ఆ సమాచారం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి చేరింది..
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న వేళ వైరస్ కంటే ప్రమాదకారులైన చీకటి బేహారులు భారతీయుల కొవిడ్ డేటాను బైట్ల లెక్కన అమ్మకానికి పెట్టారు. ప్రతి నిత్యం దేశంలో లక్షలాది కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం పౌరులు ఫోన్ నంబర్లు, ఇంటి అడ్రస్ తప్పనిసరిగా ఇస్తోన్న దరిమిలా ఆ సమాచారం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి చేరిందనే వార్త కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రాజహరియా చెప్పిన విషయాలను పీటీఐ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
దాదాపు 20 వేల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం ఓ ప్రభుత్వ సర్వర్ నుంచి అక్రమంగా బయటకు పొక్కింది. వ్యక్తుల పేర్లు, చిరునామాలు, మొబైల్ ఫోన్ నంబర్లు, కోవిడ్ పరీక్షల ఫలితాలు బయటకొచ్చాయి. ఆన్లైన్ సెర్చ్ చేసి ఈ వివరాలను చూసేందుకు వీలుగా ఉన్నాయి. Raid Forums వెబ్సైట్లో ఈ సమాచారాన్ని అమ్మకానికి పెట్టినట్లు పీటీఐ శుక్రవారం తెలిపింది.
Raid Forums వెబ్సైట్లో ఓ సైబర్ క్రిమినల్ ఈ సమాచారాన్ని ఉంచినట్లు మీడియా పేర్కొంది. దాదాపు 20 వేల మందికి సంబంధించిన సమాచారం ఉన్నట్లు ఆ క్రిమినల్ పేర్కొన్నట్లు తెలిపింది. వ్యక్తి పేరు, వయసు, చిరునామా, స్త్రీ లేదా పురుషుడు, మొబైల్ నంబర్, కోవిడ్ పరీక్షల తేదీ, ఫలితాలు వంటి వివరాలతో ఈ సమాచారాన్ని అమ్మకానికి పెట్టినట్లు వివరించింది.
సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రాజహరియా ఇచ్చిన ట్వీట్లో, వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం (పీఐఐ)ని ప్రభుత్వ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ ద్వారా బయటపెట్టినట్లు తెలిపారు. మోసపూరితమైన ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలను కోరారు. కోవిడ్-19కు సంబంధించి ఆఫర్లు ఇస్తామంటూ ఫోన్ కాల్స్ వచ్చినపుడు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.
ఈ నేపథ్యంలో ఈ-మెయిల్ ద్వారా ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదని జాతీయ మీడియా తెలిపింది. కోవిడ్ సంబంధిత సేవలు, సమాచారం కోసం అత్యధికంగా డిజిటల్ టెక్నాలజీస్పైన ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం చెప్తోంది. టీకాకరణ కోసం కూడా కోవిన్ పోర్టల్‌ను వినియోగించుకుంటున్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.