హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఉవ్వెత్తున ఎగసిన ప్రభుత్వ ఉద్యోగుల నిరసన.. ఒకేసారి మాస్ క్యాజువల్ లీవ్.. ఎందుకంటే..

ఉవ్వెత్తున ఎగసిన ప్రభుత్వ ఉద్యోగుల నిరసన.. ఒకేసారి మాస్ క్యాజువల్ లీవ్.. ఎందుకంటే..

నిరసన తెలుపుతున్న ప్రభుత్వోద్యోగులు

నిరసన తెలుపుతున్న ప్రభుత్వోద్యోగులు

Gujarat: కొన్ని నెలలుగా తమ డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ అన్ని ప్రభుత్వ విభాగాలలోని ఉద్యోగులు సాముహిక నిరసనలు చేపట్టారు. దీనిలో భాగంగా ఈరోజున వారి తీసుకున్న చర్య వార్తలలో నిలిచింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Gujarat, India

సాధారణంగా ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు తమ సమస్యలను పై అధికారులకు, కంపెనీ డైరెక్టర్ ల వరకు తీసుకెళ్తారు. అయితే... కొన్ని సందర్భాలలో ఆయా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని పైస్థాయి వారు తీసుకున్న నిర్ణయాలు కింద పనిచేసే వారికి ఇబ్బందికరంగా మారతాయి. దీంతో వారు.. తమ నిరసలను వివిధ రూపాల్లో తెలియజేస్తారు. కొందరు విధులకు హజరు కాకుండా బ్యానర్లు పట్టుకుని నిరసన తెలియజేస్తారు. మరికొందరు నలుపురంగు బ్యాడ్జీ లను వేసుకుని తమ నిరసనలను తెలియజేస్తారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. గుజరాత్ లో (Gujarat) కొన్ని నెలలుగా అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. వీరు ప్రధానంగా.. 2005లో కి ముందు చేరిన ఉద్యోగులకు పెన్షన్ విధానంను అమలు చేస్తున్నారు. దాని తర్వాత చేరిన వారికి కూడా పెన్షన్ విధానం అమలయ్యేలా చర్యలు తీసుకొవాలని గత కొన్ని నెలలుగా తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా.. రాష్ట్రంలో ఓపీఎస్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలంటూ ఉపాధ్యాయులు, పంచాయతీ ఆరోగ్య కార్యకర్తలు, రెవెన్యూ ఉద్యోగులు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలు కొంతకాలంగా నిరసనలు చేస్తున్నాయి. కాగా, పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ గుజరాత్‌ ప్రభుత్వంలోని వేలాది మంది ఉద్యోగులు, పాఠశాల ఉపాధ్యాయులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ‘మాస్‌ క్యాజువల్‌ లీవ్‌’ నిరసనలో పాల్గొన్నారు.

తమ డిమాండ్లలో చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని పేర్కొంటూ ఆయా సంఘాలు శుక్రవారం ఆందోళన విరమించాయి. అయితే OPS కోసం తమ ప్రధాన డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని జిల్లా స్థాయి సంఘాలు పేర్కొన్నాయి. మా ప్రధాన డిమాండ్ OPS మరియు ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పరిష్కరించలేదు. ఈ సమస్య రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగిని ప్రభావితం చేస్తుంది. అందుకే వారు ఈ రోజు సామూహిక CL ఆందోళనలో చేరాలని నిర్ణయించుకున్నారని సౌరాష్ట్ర ప్రాంత రాష్ట్రీయ సంయుక్త మోర్చా కన్వీనర్ మహేష్ మోరి అన్నారు. ఒక్క భావ్‌నగర్ జిల్లాలోనే దాదాపు 7 వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు శనివారం సెలవులో ఉన్నారని తెలిపారు.

అదే విధంగా.. గాంధీనగర్‌లోని పాత సచివాలయ క్యాంపస్‌లో ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో ఓపీఎస్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలంటూ ఉపాధ్యాయులు, పంచాయతీ ఆరోగ్య కార్యకర్తలు, రెవెన్యూ ఉద్యోగులు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలు కొంతకాలంగా నిరసనలు చేస్తున్నాయి. కచ్‌లో దాదాపు 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్కువగా పాఠశాల ఉపాధ్యాయులు తమ నిరసనను తెలియ చేయడానికి పనికి వెళ్లలేదు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Employees, Government jobs, Gujarat

ఉత్తమ కథలు