హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Gujarat: దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత ఉందో చెప్పడానికి ఈ వీడియో చూస్తే చాలు..  ఆ చిన్న ఉద్యోగానికే వేలాదిగా దరఖాస్తులు.. ఎక్కడంటే

Gujarat: దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత ఉందో చెప్పడానికి ఈ వీడియో చూస్తే చాలు..  ఆ చిన్న ఉద్యోగానికే వేలాదిగా దరఖాస్తులు.. ఎక్కడంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల గుజరాత్​లో వెలువడిన ఓ ఉద్యోగ ప్రకటనకు లక్షలాదిగా తరలిరావడం దేశంలో నిరుద్యోగ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇదేదో పెద్ద ఉద్యోగానికి కూడా కాదు. ఓ మామూలు గ్రామ రక్షక పోస్టు..

  కరోనా (Corona) దేశంలో కోరలు చాచింది. మొదటి దశ కరోనా కన్నా ఈ సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి వేగంగా వ్యాప్తి చెందింది. గత సంవత్సరం ఒక పీడ కలలాగా ముగించుకున్నాం అనుకుంటుండగా మళ్లీ మహమ్మారి విరుచుకుపడింది. దీంతో దేశంలో నిరుద్యోగం (Unemployment) మళ్లీ పెరుగుతోంది. నిరుద్యోగ శాతంపెరిగింది. లాక్​డౌన్​తో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది. నగరాలు, పట్టణాల్లో విధిస్తున్న లాక్‌డౌన్ కారణంగా నిరుద్యోగుల సంఖ్య 11.26 శాతానికి పెరిగింది. సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ(సీఎంఐఈ) తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, అస్సాం, ప‌శ్చిమ బెంగాల్‌, మ‌హారాష్ట్రలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందని తేల్చింది.  కాగా, ఇటీవల గుజరాత్ (Gujarat)​లో వెలువడిన ఓ ఉద్యోగ ప్రకటనకు (Job notification) లక్షలాదిగా తరలిరావడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇదేదో పెద్ద ఉద్యోగానికి కూడా కాదు. ఓ మామూలు గ్రామ రక్షక పోస్టు..

  600 పోస్టుల భర్తీ..

  గుజరాత్‌లో గ్రామ రక్షా దళ్‌ (Grama Rakshak dal)లో 600 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో గుజరాత్‌లోని బనస్కతలోని పాలన్‌పూర్ ప్రాంతంలో చేపట్టిన గ్రామ రక్షక్ దళ్ (Grama Rakshak dal) నియామక ప్రక్రియ కోసం అభ్యర్థులు పెద్ద ఎత్తున చేరుకున్నారు దీంతో ఈ ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఏర్పడటంతో పోలీసులు (police) లాఠీచార్జి చేసి నిరుద్యోగులను నిలువరించాల్సి వచ్చింది. అయితే.. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  వేలాది మంది అభ్యర్థులు (candidates) అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రదేశం మొత్తం కిక్కిరిసిపోయింది. ఒకనొక సమయంలో తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడటంతో.. ఈ రద్దీని నిలువరించేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అభ్యర్థులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. గ్రామ స్థాయి పోస్టుల కోసం ఈ స్థాయిలో నిరుద్యోగులు రావడం.. నిరుద్యోగ సమస్యకు అద్దం పట్టినట్లు ఉందని పలువురు పేర్కొంటున్నారు.

  గ్రామీణ ఉద్యోగాల కోసం వచ్చే అభ్యర్థులను చూసి నిరుద్యోగాన్ని సులభంగా అంచనా వేయవచ్చని.. విపక్షాలు అధికార పార్టీ బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. గ్రామ రక్షక్ దళ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం రాష్ట్రంలో గందరగోళంగా మారింది. శనివారం పాలన్‌పూర్‌లో కూడా జీఆర్‌డీ రిక్రూట్‌మెంట్ మేళా నిర్వహించారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహిస్తున్న ఈ రిక్రూట్‌మెంట్ మేళాకు నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అభ్యర్థులు అధికారుల మధ్య వాగ్వాదం నెలకొంది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Gujarat, Job notification

  ఉత్తమ కథలు