పౌరసత్వ సవరణ బిల్లు : అసోంలో 1000మంది నిరసనకారుల అరెస్ట్

పోలీస్ బారికేడ్లను ధ్వంసం చేస్తూ వేలాదిమంది విద్యార్థులు,ప్రజలు దిస్‌పూర్‌లోని జనతా భవన్ వైపు కదిలారు.

news18-telugu
Updated: December 11, 2019, 9:31 PM IST
పౌరసత్వ సవరణ బిల్లు : అసోంలో 1000మంది నిరసనకారుల అరెస్ట్
పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వేలాదిగా రోడ్ల పైకి వచ్చిన నిరసనకారులు
  • Share this:
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే.అసోంలో ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. బుధవారం వేలాదిమంది రోడ్డెక్కి బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది.అయినా సరే నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో గువాహటిలో మొత్తం 1000మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.నిరసనకారులకు,పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో చాలామంది గాయపడ్డారు.

పోలీస్ బారికేడ్లను ధ్వంసం చేస్తూ వేలాదిమంది విద్యార్థులు,ప్రజలు దిస్‌పూర్‌లోని జనతా భవన్ వైపు కదిలారు.ఈ క్రమంలో పలు ప్రభుత్వ హోర్డింగ్స్‌ తగలబెట్టారు. అసోం సెక్రటేరియట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు.అసోంతో పాటు త్రిపుర,మణిపూర్‌లలోనూ పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.








First published: December 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు