Home /News /national /

THOSE WHO DO NOT SPEAK HINDI ARE FOREIGNERS THEY SHOULD LEAVE INDIA SAYS BJP ALLY UP MINISTER SANJAY NISHAD MKS

Hindi row: హిందీ రానివాళ్లంతా విదేశీయులే.. భారత్ విడిచి వెళ్లండి: బీజేపీ అనుబంధ యూపీ మంత్రి వార్నింగ్

యూపీ మంత్రి సంజయ్ నిషాద్

యూపీ మంత్రి సంజయ్ నిషాద్

భారత్ లో భాషల మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. హిందీ మాత్రమే గొప్పదనే వాదనను బలపరుస్తూ బీజేపీ అనుబంధ యూపీ మంత్రి నిషాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ రానివాళ్లంతా దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించారు.

భిన్నత్వానికి ప్రతిరూపమైన భారత్ లో భాషల మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. హిందీ మాత్రమే గొప్పదంటూ కేంద్రం పెద్దలు, బీజేపీ అనుకూలురు, కొందరు బాలీవుడ్ తారలు చేస్తోన్న వాదనను ప్రాంతీయ భాషలవాళ్లు నిరసిస్తుండటంతో సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయి రచ్చ కొనసాగుతున్నది. వివాదాన్ని మరింత పెద్దది చేస్తూ బీజేపీ అనుబంధ ఉత్తరప్రదేశ్ మంత్రి ఒకరు.. హిందీ రానివాళ్లు అసలు భారతీయులే కాదని, అలాంటివాళ్లంతా తక్షణమే దేశం విడిచి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చారు. యూపీ మంత్రి తాజా వ్యాఖ్యలపై హిందీయేతర ప్రజలు మండిపడుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌ లో బీజేపీ అనుబంధ నిషాద్ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రి సంజయ్‌ నిషాద్‌ వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేశారు. హిందీ మాట్లాడటం రానివాళ్లు, హిందీని ఇష్టపడనివాళ్లు, హిందీపై ప్రేమలేని వాళ్లు ముమ్మాటికీ విదేశీయులు లేదా విదేశీ శక్తులతో లింకులున్నవారే అని యూపీ మంత్రి నిషాద్ సూత్రీకరించారు. ఇండియాలో ఉండదల్చుకుంటే కచ్చితంగా హిందీని ప్రేమించాల్సిందేనని, ఇండియా అంటే హిందుస్థాన్‌ అనే రాజ్యాంగం చెబుతున్నదని, దాని అర్థం హిందీ మాట్లాడేవారే హిందుస్థానీలనీ, దీన్ని కాదన్నవాళ్లు దేశం విడిచిపోవాలని మంత్రి నిషాద్ హెచ్చరించారు.

Petrol Diesel బంపర్ ఛాన్స్: తక్కువ సమయంలో భారీ లాభాలు పొందే Business Idea ఇది..


హిందీలోకి డబ్ అయిన ప్రాంతీయ భాషా సినిమాలు ప్రభంజన విజయాలు సాధిస్తున్న క్రమంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ , కన్నడ నటుడు కిచ్చా సుదీప్ మధ్య వివాదం రాజుకోవడం, దాదాపు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలూ సంబంధిత విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. ఇదే అంశంపై యూపీ మంత్రి నిషాద్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు అన్ని ప్రాంతీయ భాషలపై గౌరవం ఉన్నప్పటికీ, చట్టం ప్రకారం హిందీ జాతీయ భాష కాబట్టి.. చట్టాన్ని ఉల్లంఘించే వారిని కటకటాల్లోకి నెట్టాలి. హిందీని నిరాకరించడం ద్వారా కొందరు ఉద్రిక్తతలు సృష్టించాలని అనుకుంటున్నారు..’అని మంత్రి నిషాద్ ఆరోపించారు.

PM Kisan: రైతులకు డబుల్ బొనాంజా? భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ డబ్బులు తీసుకోవచ్చా? నిబంధనలివే..


హిందీ రానివాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ యూపీ మంత్రి సంజయ్ నిషాద్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఘాటుగా స్పందించాయి. మంత్రి క్షమాపణలు చెప్పాలని పలు పార్టీలు డిమాండ్ చేశాయి. భారత రాజ్యంగం ఏ భాషకూ 'జాతీయ భాష' హోదా ఇవ్వదని, ఎనిమిదవ షెడ్యూల్‌లో 22 అధికారిక భాషలు ఉన్నాయని, అధికారిక భాషల చట్టం 1963, కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రయోజనాల కోసం ఇంగ్లీష్ లేదా హిందీని సూచిస్తుందని నేతలు గుర్తుచేస్తున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Hindi Cinema, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు