ఉల్లి ధర కేజీ రూ.500 అయినా ఆ గ్రామస్తులకి డోంట్ కేర్...

ఆ గ్రామస్తులు ఉల్లి, వెల్లుల్లి మాత్రమే కాదు. మద్యం కూడా ముట్టుకోరు. ఒకటి రెండేళ్లు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతుంది.

news18-telugu
Updated: December 5, 2019, 6:04 PM IST
ఉల్లి ధర కేజీ రూ.500 అయినా ఆ గ్రామస్తులకి డోంట్ కేర్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉల్లి ధరలు మండిపోతున్నాయి. కేజీ ఉల్లి రూ.100, రూ.125 వరకు చేరుకుంటోంది. దీంతో ప్రజలే కాదు, ప్రభుత్వాలు కూడా భయపడుతున్నాయి. ప్రజలకు ఉల్లి ఘాటు తగ్గించేందుకు సబ్సిడీ మీద ఉల్లిని తక్కువ ధరలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే, ఉల్లి రూ.150 కాదు, రూ.500 అయినా ఆ గ్రామస్తులకి డోంట్ కేర్. ఎందుకంటే వారు అసలు ఉల్లి తినరు. బీహార్‌లోని జెహనాబాద్ జిల్లాలో ఉందీ త్రిలోకీ బీగా అనే గ్రామం. ఆ గ్రామంలో 35 కుటుంబాలు ఉంటాయి. గ్రామ జనాభా 300 - 400 వరకు ఉంటుంది. ఆ గ్రామంలో కొన్ని శతాబ్దాలుగా ఎవరూ ఉల్లి, వెల్లుల్లి తినరు. అంతా శాఖాహారులే. గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. వెంకన్నను భక్తితో కొలిచే ఆ గ్రామస్తులు ఉల్లి, వెల్లుల్లి మాత్రమే కాదు. మద్యం కూడా ముట్టుకోరు. ఒకటి రెండేళ్లు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఆచారం తమ గ్రామంలో కొనసాగుతుందని గ్రామంలోని పెద్దలు చెప్పారు.

తింటే ఏమవుతుందో చూద్దామని ఎవరైనా ఉల్లి, వెల్లుల్లి లాంటివి తింటే వారికి ప్రమాదం జరిగిందట. అందుకే ఎవరూ మళ్లీ ధైర్యం చేయడం లేదు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఇప్పటికీ పాటిస్తున్నారు. ఒకవేళ గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు ఏదైనా పనిమీద వెళ్లినా.. అక్కడ ఉల్లి, వెల్లుల్లి వాడని పూర్తి శాఖాహార హోటల్‌ను చూసుకుని అక్కడే తింటారు. అలాంటివి దొరక్కపోతే పస్తు పడుకొంటారే కానీ ఉల్లి మాత్రం తినరు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 5, 2019, 6:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading