#MissionPaani:ప్రభుత్వం,మీడియా కాదు.. ప్రతీ ఒక్కరు దీన్ని తమ బాధ్యతగా గుర్తించాలి:సద్గురు

Mission Paani : నేల,నీరు,విశ్వం అనేవి కేవలం మనుషుల కోసమే కాదని.. ప్రపంచంలో అనేక ఇతర ప్రాణులు ఉన్నాయని సద్గురు అన్నారు.

news18-telugu
Updated: August 27, 2019, 3:49 PM IST
#MissionPaani:ప్రభుత్వం,మీడియా కాదు.. ప్రతీ ఒక్కరు దీన్ని తమ బాధ్యతగా గుర్తించాలి:సద్గురు
మిషన్ పానీ క్యాంపెయిన్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జగ్గీ వాసుదేవ్
  • Share this:
నెట్‌వర్క్18-హార్పిక్ సంయుక్తంగా చేపట్టిన మిషన్ పానీ క్యాంపెయిన్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ముంబైలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మిషన్ పానీపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. నేల,నీరు,విశ్వం అనేవి కేవలం మనుషుల కోసమే కాదని.. ప్రపంచంలో అనేక ఇతర ప్రాణులు ఉన్నాయని సద్గురు అన్నారు. కాబట్టి నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉండాలన్నారు.గడిచిన 50ఏళ్లలో కావేరీ బేసిన్‌లో నీరు గణనీయంగా తగ్గిపోయిందన్నారు. నదుల సంరక్షణ కోసం చేపట్టిన ర్యాలీ ద్వారా దేశ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించామన్నారు.దేశంలో ప్రవహిస్తున్న నదుల్లో కనీసం 25%-30% నీరు సముద్రాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని.. లేదంటే చాలా ప్రాంతాలు వరద నీటితో ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. మనం బాధ్యతగల పౌరులం అవునో.. కాదో.. భవిష్యత్‌లో తేలుతుందన్నారు. తాగునీటి పరిరక్షణ అన్నది ప్రభుత్వాలో..లేక మీడియానో చేయాల్సిన పని కాదని.. ప్రతీ ఒక్కరూ దాన్ని తమ బాధ్యతగా గుర్తించాలని అన్నారు. అలా అయితేనే రేపటి తరాలకు వనరులతో కూడిన భారత్‌ను అందించగలమన్నారు.
Published by: Srinivas Mittapalli
First published: August 27, 2019, 3:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading