Home /News /national /

THIS IS UNACCEPTABLE LAW MINISTER OVER GROWING PERSONAL ATTACKS ON JUDGES ON SOCIAL MEDIA BA

జడ్జిల మీద సోషల్ మీడియా దాడులపై కేంద్ర మంత్రి సీరియస్ కామెంట్స్

రవిశంకర్ ప్రసాద్, కేంద్ర మంత్రి

రవిశంకర్ ప్రసాద్, కేంద్ర మంత్రి

జడ్జిలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వారిపై వ్యక్తిగతంగా జరుగుతున్న దాడులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు.

    జడ్జిలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వారిపై వ్యక్తిగతంగా జరుగుతున్న దాడులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఇలాంటివాటిని ఒప్పుకోబోమన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు రాసిన వ్యాసంలో రవిశంకర్ ప్రసాద్ దీనిపై స్పందించారు. న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా నెగిటివ్ ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం, కేసులకు సంబంధించి జడ్జిలు ఎలాంటి తీర్పు ఇవ్వాలో సోషల్ మీడియా వేదికగా నిర్దేశించడం, అలాగే, తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే జడ్జిల మీద దుష్ప్రచారం చేయడం’ సరికాదని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌‌‌ను అభిశంసించాలన్న కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ న్యాయవాదుల ప్రయత్నం ఈ మధ్యకాలంలో జ్యుడీషియరీ స్వయంప్రతిపత్తి మీద జరిగిన అదిపెద్ద దాడి అని అభివర్ణించారు. ఈ తరహా ‘నాదారి లేదా రహదారి’ (నా మాట వినాలి. లేకపోతే బయటకు పంపేస్తాం.) విధానం ఈ మధ్యకాలంలో న్యాయవ్యవస్థ స్యయంప్రతిపత్తికి సవాలుగా మారుతోందన్నారు.

    దేశంలో అత్యయిక పరిస్థితి విధించినప్పుడు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీలోని చాలా మంది నేతలు న్యాయవ్యవస్థ స్యయంప్రతిపత్తిని కాపాడుకునేందుకు ప్రయత్నించామని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. కాబట్టి, ప్రస్తుతం న్యాయవ్యవస్థ మీద జరుగుతున్న, పెరుగుతున్న దాడి తమకు ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ‘ఎన్నికల్లో ప్రజల చేతిలో తిరస్కరణకు గురైన వారు, గెలిచిన ప్రభుత్వం యొక్క పరిపాలన, గవర్నెన్స్‌ను సుప్రీంకోర్టులు లేదా ఇతర కోర్టుల ద్వారా కంట్రోల్ చేయాలనుకోకూడదు. అలా చేయజాలరు. ఇది ఆమోదయోగ్యం కాదు.’ అని రవిశంకర్ ప్రసాద్ రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

    ఇటీవల సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్‌ను కోర్టు ధిక్కారం కేసులో సుప్రీంకోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు రూ.1 జరిమానా విధించింది. ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి ఈ విధంగా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

    మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికార వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం హైకోర్టు జడ్జిల మీద కూడా కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. ఆ తీవ్ర విమర్శలు చేసిన వారి మీద కేసులు నమోదు చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశించింది. అందులో కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు, వైసీపీ కార్యకర్తలు ఉన్నారని తెలుస్తోంది. అయితే, తమ కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసంటూ వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో దుమారం రేపాయి. మరోవైపు వైసీపీ చేతిలో ఓడిన టీడీపీనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేయిస్తోందని వైసీపీ నేతలు ఆరోపించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: AP High Court, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు