ఓ సివిల్స్ టాపర్ ఇలా చెప్పడం బహుశా ఇదే మొదటిసారేమో!

UPSC topper Kanishka Kataria : కనిష్క కటారియా సొంత రాష్ట్రం రాజస్థాన్. ముంబై ఐఐటీలో బీటెక్ పూర్తి చేసిన కనిష్క కటారియా మ్యాథమేటిక్స్ తన ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నాడు. ప్రస్తుతం డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు.

news18-telugu
Updated: April 6, 2019, 7:24 AM IST
ఓ సివిల్స్ టాపర్ ఇలా చెప్పడం బహుశా ఇదే మొదటిసారేమో!
యూపీఎస్‌సీ టాపర్ కనిష్క కటారియా (Image : ANI/Twitter)
  • Share this:
సివిల్స్.. ఎందరో విద్యార్థుల కల.. దేశ అత్యున్నత సర్వీస్‌గా భావించే సివిల్స్‌లో విజయం సాధించడమనేది మాటల్లో చెప్పలేని అనుభూతి. తాజాగా విడుదలైన యూపీఎస్‌సీ ఫలితాల్లో ఐఐటీ ముంబైకి చెందిన కనిష్క కటారియా టాప్ ర్యాంక్ సాధించాడు. టాప్ ర్యాంక్ సాధించిన సంతోషాన్ని మీడియాతో పంచుకున్న కటారియా.. తన విజయానికి గర్ల్‌ఫ్రెండ్‌కు థ్యాంక్స్ చెప్పడం విశేషం. బహుశా ఓ యూపీఎస్‌సీ టాపర్.. తను సాధించిన విజయానికి గర్ల్‌ఫ్రెండ్‌కు థ్యాంక్స్ చెప్పడం ఇదే మొదటిసారేమో అంటున్నారు.

ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మొదటి ర్యాంక్ వస్తుందని నిజంగా నేను అనుకోలేదు. ఇందుకు నా తల్లిదండ్రులు, సోదరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే నాకు నైతికంగా మద్దతునిచ్చి.. నాకు అండగా నిలబడ్డ గర్ల్‌ఫ్రెండ్‌కు థ్యాంక్స్ చెబుతున్నా. ప్రజలకు మంచి అడ్మినిస్ట్రేషన్ అందించాలన్నదే నా ఉద్దేశం.
కనిష్క కటారియా, సివిల్స్ టాపర్


కనిష్క కటారియా సొంత రాష్ట్రం రాజస్థాన్. ముంబై ఐఐటీలో బీటెక్ పూర్తి చేసిన కనిష్క కటారియా మ్యాథమేటిక్స్ తన ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నాడు. ప్రస్తుతం డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు. కనిష్క యూపీఎస్‌సీ టాపర్‌గా నిలవడంతో రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆయన్ను ట్విట్టర్ ద్వారా అభినందించారు. కాగా, యూపీఎస్‌సీ ఫలితాల్లో టాప్-25లో 15మంది పురుషులు కాగా, 10 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 759 మంది విద్యార్థులు సివిల్స్‌కు అర్హత సాధించగా.. అందులో 577 మంది పురుషులు, 182 మంది మహిళలు ఉన్నారు.

First published: April 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు