Home /News /national /

THIS IS HOW PUNJAB CONJOINED TWINS CAST VOTES WHILE MAINTAINING SECRECY PVN

Punjab Polling : మొదటిసారి ఓటు వేసిన అవిభక్త కవలలు..ఒకరు చూడకుండా ఒకరు ఎలాగంటే

అవిభక్త కవలలు సోహ్నా సింగ్‌, మోహ్నా సింగ్‌

అవిభక్త కవలలు సోహ్నా సింగ్‌, మోహ్నా సింగ్‌

Conjoined Twins Cast Votes : ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ (Punjab Polling)మొదలయింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. కరోనా నేపథ్యంలో ఓటర్లు కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.

ఇంకా చదవండి ...
Conjoined Twins Cast Votes :  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ పంజాబ్‌ లో అసెంబ్లీ ఎన్నికల (Punjab Assembly Elections 2022) పోలింగ్‌ ప్రారంభమయింది. ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ (Punjab Polling)మొదలయింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. కరోనా నేపథ్యంలో ఓటర్లు కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. పంజాబ్‌లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాలునాలకు ఇవాళ ఒకే విడతలో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ లో అవిభక్త కవలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అవిభక్త కవలలైన సోహ్నా సింగ్‌, మోహ్నా సింగ్‌ లు.. అమృత్‌ సర్‌ లోని మనావాలాలో తొలిసారిగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఒకే శరీరాన్ని పంచుకుంటున్న ఈ సోదరులకు ఎన్నికల కమిషన్‌ వేర్వేరుగా ఓటుహక్కు కల్పించింది. ఇద్దరు వేర్వేరు ఓటర్ల మధ్య గోప్యత పాటించేందుకు పోలింగ్ బూత్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

ALSO READ Nano Turns Helicopter : వాటే ఐడియా బాసూ..టాటా నానో కారుని హెలికాఫ్టర్ గా మార్చి అద్దెకు

"ఇది చాలా ప్రత్యేకమైన కేసు. సరైన వీడియోగ్రఫీ చేయాలని ఎన్నికల సంఘం చెప్పింది. వారు PWD ఓటర్లకు ఐకాన్ లు. వారు కలిసి ఉన్నారు కానీ ఇద్దరు వేర్వేరు ఓటర్లు. ఓటింగ్‌ లో గోప్యత పాటించేలా ఆర్‌ఓ వారికి కళ్లజోడు ఇచ్చే ఏర్పాట్లు చేశారు" అని పీఆర్ఓ గౌరవ్‌కుమార్‌ తెలిపారు.

గత నెలలో ఎన్నికల సంఘం.. సోహ్నా మరియు మోహ్నాలను వేర్వేరు ఓటర్లుగా పరిగణించింది. వారిద్దరికీ వ్యక్తిగత ఓటు హక్కును కల్పించింది. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎస్ కరుణ రాజు వారికి రెండు వేర్వేరు ఎలక్టోరల్ ఫోటో గుర్తింపు కార్డులను అందజేశారు.

ALSO READ Dawood Ibrahim : భారత్ లో మళ్లీ మతకల్లోలాలు,ఉగ్రదాడులకు దావూద్ భారీ స్కెచ్..ఇందుకోసం ఏకంగా

కాగా, 2003 జూన్‌లో ఢిల్లీలో జన్మించిన సోహ్నా మరియు మోహ్నాలను తల్లిదండ్రులు వదిలేశారు. వారిని అమృత్‌సర్‌లోని ఓ అనాథ శరణాలయం దత్తత తీసుకుంది. సోహ్నా మరియు మోహ్నా ఇద్దరికి 18 సంవత్సరాలు నిండాయి. ఈ అవిభక్త కవలలు ఇద్దరూ ఇటీవల పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (PSPCL)లో ఉద్యోగం సంపాదించి వార్తల్లో నిలిచారు. వారిని అమృత్‌ సర్ లోని డెంటల్ కాలేజ్ అమృత్‌ సర్ సమీపంలోని 66-KV PSPCL కార్యాలయంలో పోస్ట్ చేశారు
Published by:Venkaiah Naidu
First published:

Tags: 5 State Elections, Polling, Punjab Assembly Elections 2022, Vote

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు