Home /News /national /

THIS IS AMAZING DOCTORS WHO REPLACED BOTH HANDS IS THE BOOK OF THE VICE PRESIDENT UMG GH

Hands Transplant: వైద్య రంగంలో ఇదో అద్భుతం ! రెండు చేతులను రీప్లేస్ చేసిన డాక్టర్లు.. అది ఇంకెక్కడో కాదూ..!

 ఇదో అద్భుతం ! రెండు చేతులను రీప్లేస్ చేసిన డాక్టర్లు..  ఉపరాష్ట్రపతి కితాబు..  ఎక్కడంటే ?

ఇదో అద్భుతం ! రెండు చేతులను రీప్లేస్ చేసిన డాక్టర్లు.. ఉపరాష్ట్రపతి కితాబు.. ఎక్కడంటే ?

తమిళనాడు(Tamil Nadu) డాక్టర్లు ఒక వ్యక్తికి రెండు చేతులను విజయవంతంగా మార్పిడి చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల యువకుడికి 14 గంటలు శ్రమించి రెండు చేతుల(Hands)ను విజయవంతంగా అమర్చినట్లు గ్లెనెగల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రి వెల్లడించింది.

ఇంకా చదవండి ...
అవయవ మార్పిడి (Organ transplant) ఆపరేషన్(Operation) పూర్తి చేయడం మామూలు విషయం కాదు. చిన్న తప్పు కూడా జరగకుండా చాలా కచ్చితత్వంతో వైద్యులు(Doctors) ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాల్సి ఉంటుంది. అయితే తాజాగా తమిళనాడు డాక్టర్లు ఒక వ్యక్తికి రెండు చేతులను విజయవంతంగా మార్పిడి చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. తమిళనాడు(Tamil Nadu)కు చెందిన 24 ఏళ్ల యువకుడికి 14 గంటలు శ్రమించి రెండు చేతులను విజయవంతంగా అమర్చినట్లు గ్లెనెగల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రి వెల్లడించింది.

గుజరాత్‌కు చెందిన ఒక మహిళ బ్రెయిన్-డెడ్ కాగా ఆమె చేతులను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఆ తరువాత ఆసుపత్రి వైద్యులు యువకుడికి బైలేటరల్ హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ (Bilateral Hand Transplant Surgery) మొదలుపెట్టారు. అత్యంత క్లిష్టమైన ఈ సర్జరీని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. ఎట్టకేలకు రెండు చేతులను పోగొట్టుకున్న వ్యక్తికి మళ్లీ చేతులను అతికించారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సర్జరీ చేసిన వైద్యుల బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. కాంచీపురం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి 2018లో కరెంట్ షాక్‌కి గురయ్యాడు. ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. అప్పటినుంచి తల్లి మీదే ఆధారపడుతున్నాడు. అయితే సాధారణ జీవితం గడపాలన్న ఉద్దేశంతో అతను చేతి మార్పిడి కోసం తమిళనాడు ట్రాన్స్‌ప్లాంట్ అథారిటీ (TRANSTAN)లో రిజిస్టర్ చేసుకున్నాడు. మే 28న అహ్మదాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ హాండ్స్‌ తనకు మ్యాచ్‌ అవుతాయని కనుగొన్నాడు. ఆయా ఏజెన్సీల నుంచి అవసరమైన క్లియరెన్స్ సేకరించి అహ్మదాబాద్ నుంచి చెన్నైకి చేరుకున్నాడు. చెన్నైలోని గ్లెనెగల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రి వైద్యులు 14 గంటల సర్జరీ కోసం అతడిని వీల్‌చైర్‌లో కూర్చోబెట్టారు.

ఇదీ చదవండి:  Indian Villages: టూర్ ప్లాన్ చేస్తున్నారా ? నార్త్ లో ఈ ప్రాంతాలకు వెళ్తే.. ఎప్పటికీ మీరు మరచిపోలేరు..!


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ ఎస్ సెల్వ సీతారామన్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ సర్జరీని చేపట్టింది. ఇందులో ఎనిమిది మంది ప్లాస్టిక్ సర్జన్లు, నలుగురు ఆర్థోపెడిక్స్, ఒక వాస్కులర్ సర్జన్, నలుగురు అనస్థీషియా నిపుణులు, ఒక న్యూరాలజిస్ట్, 30 మంది పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆపరేషన్ మే 28న జరిగింది. అంటే 60 రోజులకు పైగా గడుస్తోంది. ఇప్పటికీ రోగి బాగానే ఉన్నాడని, ఇంటెన్సివ్ ఫిజియోథెరపీతో కోలుకుంటున్నాడని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.“భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇలాంటి విశేషమైన, అంకితభావం గల వైద్యులు ఉండటం గర్వకారణంగా అనిపిస్తోంది. నాకు తెలిసి ఈ సర్జరీ నిజంగా చాలా శ్రమతో కూడుకున్నది. ఒక బృందంగా దీనిని సాధించడంలో వైద్యులు చాలా కచ్చితమైన విధానాన్ని పాటించారు. ప్రజలు ముందుకు వచ్చి అవయవాలను దానం చేయాలని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ముఖ్యంగా బ్రెయిన్ డెడ్ రోగుల అవయవాలను దానం చేసి దివ్యాంగులకు నాణ్యమైన జీవితాన్ని అందించేలా ప్రజలను చేయించడానికి ఈ కేసు ఒక గొప్ప ఉదాహరణ" అని వెంకయ్య నాయుడు అన్నారు.
Published by:Mahesh
First published:

Tags: Doctors, Gujarat, Tamilnadu, Venkaiah Naidu

తదుపరి వార్తలు