హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Finance Influencer: డ్రీమ్‌ కాలేజ్‌లో సీటు దక్కించుకోలేదు, కానీ ఇప్పుడు అదే ఇన్‌స్టిట్యూట్‌కు గెస్డ్‌ స్పీకర్‌.. యువకుడి సక్సెస్ స్టోరీ?

Finance Influencer: డ్రీమ్‌ కాలేజ్‌లో సీటు దక్కించుకోలేదు, కానీ ఇప్పుడు అదే ఇన్‌స్టిట్యూట్‌కు గెస్డ్‌ స్పీకర్‌.. యువకుడి సక్సెస్ స్టోరీ?

 శరణ్‌ హెగ్డే

శరణ్‌ హెగ్డే

కంటెంట్‌ క్రియేషన్‌లో భాగంగా ఫైనాన్ష్‌ టిప్స్‌ అందిస్తూ దూసుకుపోతున్న వారిలో పాపులర్ పర్సన్ శరన్‌ హెగ్డే. ఇటీవల ఐఐఎం బెంగళూరుకు గెస్ట్‌ స్పీకర్‌గా వెళ్లిన శరణ్‌.. తన ఐఐఎం కల ఎలా దూరమైంది.. తన జర్నీ తిరిగి ఐఐఎంకి ఎలా చేరుకుందనే వివరాలను ఫాలోవర్స్‌తో పంచుకొన్నారు..

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Finance Influencer: ఈ తరం యువతకు ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆసక్తి పెరుగుతోంది. చిన్న వయసులోనే ఎంతోకొంత డబ్బు ఇన్వెస్ట్ చేయాలని భావించేవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి వారికి కొందరు ప్రొఫెషనల్స్ టిప్స్ ఇస్తుంటారు. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగించే వారికి మనీ ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ ఇచ్చే ప్రొఫెషనల్స్ గురించి యాడ్స్ కనిపిస్తుంటాయి. ఇలా కంటెంట్‌ క్రియేషన్‌లో భాగంగా ఫైనాన్ష్‌ టిప్స్‌ అందిస్తూ దూసుకుపోతున్న వారిలో పాపులర్ పర్సన్ శరన్‌ హెగ్డే. ఈ ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 20 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల ఐఐఎం బెంగళూరుకు గెస్ట్‌ స్పీకర్‌గా వెళ్లిన శరణ్‌.. తన ఐఐఎం కల ఎలా దూరమైంది.. తన జర్నీ తిరిగి ఐఐఎంకి ఎలా చేరుకుందనే వివరాలను ఫాలోవర్స్‌తో పంచుకొన్నారు.

విద్యార్థిగా దక్కని ప్రవేశం.. గెస్ట్‌ స్పీకర్‌గా ఆహ్వానం..

మూడు సంవత్సరాల క్రితం కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT)లో 98 పర్సంటైల్ స్కోర్ చేశాడు శరణ్. అయినా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-బెంగళూరులో చేరాలనే తన కల నెరవేరలేదని అతడు పేర్కొన్నారు. ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్ రాకపోవడంతో, యునైటెడ్ స్టేట్స్‌లో డిగ్రీ చేయాలని భావించినట్లు తెలిపారు. కొలంబియా యూనివర్సిటీలో ప్రవేశించానని, కానీ కంటెంట్ క్రియేషన్‌ రంగంలో కెరీర్‌ ప్రారంభించాలనే ఉద్దేశంతో బయటకు వచ్చానని వివరించారు. ఈ విభాగంలో విజయం సాధించిన శరణ్‌ హెగ్డే, తన కలల కళాశాలలో విద్యార్థిగా కాకుండా గెస్ట్ స్పీకర్‌గా అడుగుపెట్టగలిగారు.

FakeCatcher: ఫేక్‌ వీడియోలను క్షణాల్లోనే గుర్తించే ఫేక్‌ క్యాచర్‌.. ఇంటెల్ కొత్త టెక్నాలజీ..

నెరవేరని ఐఐఎం కల

శరణ్‌ హెగ్డే ఒక మాజీ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్. కరోనా సమయంలో కంటెంట్ క్రియేషన్‌పై దృష్టి సారించి సక్సెస్ అయ్యాడు. అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో IIM-బెంగళూరు క్యాంపస్‌లో ఉన్న ఫొటోని పోస్ట్‌ చేశారు. అక్కడ ‘కామన్ అడ్మిషన్ టెస్ట్‌లో 98% నో ఎంట్రీ.. బెటర్‌ లక్‌ నెక్స్ట్‌ టైమ్‌ GEM (జనరల్ ఇంజనీర్ మేల్‌)’ అని రాశారు. అదే వ్యక్తి ఇప్పుడు 3.3 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో IIMBలో 100+ మహిళా పారిశ్రామికవేత్తలకు గెస్ట్‌ స్సీకర్‌ అని తెలిపారు. తన జర్నీ గురించి, తన ఐఐఎం కలను ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందనే వివరాలను తెలిపారు.

‘మూడు సంవత్సరాల క్రితం IIM కలను వదులుకున్నాను. ఇప్పుడు నేను IIMలోనే ఉన్నాను. నా చేతులతో మైక్‌ పట్టుకొని వేదికపై నిలబడి ఉన్నప్పుడు, నా ముఖంలో పెద్ద చిరునవ్వు వచ్చింది. ఎందుకంటే ఒక సంవత్సరంపాటు CAT ప్రిపరేషన్ కోసం నేను వెచ్చించిన సమయం వృథా అని అనుకున్నాను. బెంగళూరులోని ఇందిరానగర్‌లో రూ.5,000 స్టైఫండ్‌తో కొనసాగించిన ప్రిపరేషన్‌ చాలా కఠినమైన ప్రయాణం. ఇంటర్న్‌షిప్, చదువులు, వీక్లీ మాక్ ఎగ్జామ్స్‌ మేనేజ్‌ చేస్తూ చదివాను. చివరకు ఫలితాలు వెలువడ్డాయి. నేను 98% స్కోర్ చేసాను. అయినా ఐఐఎంలో సీటు లభించలేదు.’ అని శరణ్ చెప్పారు. ఆ సమయంలో తాను IIM A, B, C ఆప్షన్లను ఎంచుకోలేదని, అది తెలివితక్కువ పని అని ఇప్పుడు గ్రహించానన్నారు. తన వృత్తిపరమైన ప్రయాణంలో చాలా భాగం ఇతర IIMల నుంచి వచ్చిన సహోద్యోగుల సహకారం ఎంతో ఉందని చెప్పారు.

శరణ్ మాట్లాడుతూ.. తన ఆలోచన తీరు మార్చుకుని యూఎస్‌లో MBA కోసం కొలంబియా వెళ్లానని, చివరికి అది కూడా వదులుకొని తాను సీటు సాధించలేని కాలేజీలో గెస్ట్‌ స్పీకర్‌గా వేదికపై నిల్చుని ఉన్నానని చెప్పారు. లైఫ్‌ సర్కిల్‌గా ఉండటం చూసి నవ్వు వస్తోందని, చివరికి ఏది జరిగినా అది మంచికే జరుగుతుందని, దానిని వేరే కోణం నుంచి ఎలా చూడాలో, ఉత్తమంగా ఎలా పొందాలో తెలుసుకోవాలని సూచించారు.

First published:

Tags: Bangalore, Iim, Success story

ఉత్తమ కథలు