ఈ అంకుల్ డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం!

news18
Updated: June 1, 2018, 5:35 AM IST
ఈ అంకుల్ డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం!
  • News18
  • Last Updated: June 1, 2018, 5:35 AM IST
  • Share this:
పది మందిని  ఆకట్టుకొనే  ఏ వీడియో  అయిన సరే  సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తే ఎంత వైరల్ అవుతుంతో  మన అందరికి తెలిసిందే. మలయాళంలో ఓ చిన్న సినిమాలో కన్ను గీటే వీడియోతో  సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రికి రాత్రే ప్రియ వారియర్  పెద్ద స్టార్ గా మారిపోయింది.

ఇక అసలు విషయానికి వస్తే  గత రెండు రోజులుగా ఫేస్ బుక్, వాట్స్ యాప్ , ట్విట్టర్ లో  ఓ అంకుల్ సందడి చేస్తున్నాడు. 40 ఏళ్లు పైబడిన ఓ వ్యక్తి ఏదో  ఫంక్షన్ లో స్టేజీపై వేసిన స్టెప్పులకు ఇప్పుడు అంతా ఫిదా అయిపోతున్నారు. జితేంద్ర, శతృఘ్నసిన్హా, గోవిందా కాంబోలో వచ్చిన ఖుద్‌గర్జ్‌(1987) మూవీలోని ‘ఆప్‌ కే ఆ జానే సే...’  పాటకు ఆ వ్యక్తి డాన్స్‌ చేశాడు. అచ్చం గోవిందాను ఇమిటేట్‌ చేస్తూ అతను చేసిన డాన్స్  మూమెంట్స్‌  తెగ ఆకట్టుకొంటున్నాయి .

అయన  పక్కన ఉన్న ఓ ఆంటీ  అతని స్పీడ్ ని అందుకోలేక  అలా చూస్తుండిపోయింది. మ్యాజిక్‌ స్టెప్పులకు పేరున్న గోవిందనే తలదన్నెలా స్టెప్పులేశారంటూ ఆ అంకుల్‌పై అంతా ప్రశంసలు గుప్పిస్తున్నారు. సెలబ్రిటీల దగ్గరి నుంచి సామాన్యుల దాకా దాదాపు ప్రతీ ఒక్కరూ ఈ వీడియోను షేర్  చేస్తున్నారు.

ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తున్నది ఎవరు? ఎక్కడ తీశారు? ఎప్పుడు తీశారు? అన్న విషయాలు తెలియకపోయినా, ఇది తెగ వైరల్ అవుతోంది.  ఆ వీడియోను మీరూ ఓసారి చూడండి.


ఈ వీడియో పేస్ బుక్ లో కూడా తెగ  సర్క్యూలేట్‌ చేస్తున్నారు .

Published by: Sunil Kumar Jammula
First published: June 1, 2018, 5:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading