ఈ కాలంలో యువత పుస్తక పఠనానికి దూరమవుతున్నారు. కాలేజీ, ఆఫీసు ముగిసిన తర్వాత.. ఫోన్‌లోనే మునిగి తేలుతున్నారు. కానీ పుస్తకాలు చదివేవారు తక్కువవుతున్నారు. ఈ నేపథ్యంలో యువ తరంలో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు ఓ పండ్ల వ్యాపారి. తమ దుకాణంలో పండ్లు కొనే వారికి ఉచితంగా పుస్తకాలను అందజేస్తున్నాడు. తమిళనాడులోని తంజావూరు జిల్లాకు చెందిన ఓ పుస్తక విక్రేత.. కస్టమర్లకు పుస్తకాలను బహుమతిగా ఇస్తున్నాడు. దీని వెనక ఒక బలకమైన కారణముంది.
తంజావూరులోని పుక్కర వీధికి చెందిన ఖాజా మొయిదీన్ అనే 63 ఏళ్ల వ్యక్తి.. గత కొన్నేళ్లుగా తన ఇంటి ముందు పండ్ల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను అనుసరిస్తారు. అందుకే ఖాజా మొయిదీన్‌ను అందరూ కామ్రేడ్ అని పిలుస్తారు. పండ్ల దుకాణం పేరు కూడా 'తోజర్ పజకడై' (కామ్రేడ్ ఫ్రూట్ షాప్) అని పెట్టుకున్నారు. ఐతే గత కొన్నేళ్లుగా తమ షాప్‌లో పండ్లు కొనే కస్టమర్లకు ఉచితంగా పుస్తకాలను అందజేస్తున్నాడు ఖాజా.
'' దురదృష్టవశాత్తు పదకొండేళ్ల క్రితం నా కొడుకు చనిపోయాడు. ఆ బాధ నుంచి మనసు మళ్లించేందుకు పుస్తకాల పఠనాన్ని అలవాటు చేసుకున్నాడు. అలా అనేక పుస్తకాలను సేకరించాను. అంతేకాదు వాటిని మా షాప్‌కు వచ్చే వారితోనూ పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ప్రతి కస్టమర్‌కు ఉచిత పుస్తకాలను అందజేస్తున్నారు. పుస్తక పఠనం విలువపై అవగాహన పెంచే ప్రయత్నంలో భాగంగా కస్టమర్లకు నాయకుల జీవిత చరిత్రలు, పిల్లల కథలు, తమిళం-ఇంగ్లీష్ నిఘంటువు వంటి పుస్తకాలను ఉచితంగా అందజేస్తున్నా. '' అని ఖాజా మొయిదీన్ పేర్కొన్నారు.
Inspiration Story: పానీపూరీ తయారీలో క్వీన్.. యువతి ట్యాలెంట్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు..
తన చిన్న తనంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా తాను తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని ఆయన చెప్పారు. చిన్నప్పటి నుంచీ నవలలు చదివే అలవాటుందని తెలిపారు. తమ కుటుంబం పుక్కర వీధి పరిసరాల్లో నిర్వహించే క్రీడా కార్యక్రమాల సందర్శకులకు పుస్తకాలను బహుమతిగా ఇచ్చేదని పేర్కొన్నారు.
Photos : స్కూలే తోట.. విద్యార్థులే రైతులు.. ఏం పండించారో చూడండి
'' నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత నేను నా భార్యను బాగా చదువుకోమని ప్రోత్సహించాను. ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత నా భార్య ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా నియమితులయ్యారు. నా కొడుకు కూడా న్యాయవాది. నా భార్య, కొడుకు చదువులో బాగా రాణించేలా చూసుకున్నా. అందుకే యువత పుస్తకాలు చదవాలన్న ఉద్దేశంతో.. గత 11 సంవత్సరాలుగా వినియోగదారులకు పుస్తకాలు, వాటర్ బాటిళ్లను అందజేస్తున్నా. వారిని కుటుంబ సభ్యులుగా భావించి పుస్తకాలను చదివే అలవాటు పెంపొందించాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తున్నా.'' అని చెప్పారు.
కస్టమర్లు తనను పండ్ల వ్యాపారిగా చూడరని.. సొంత కుటుంబ సభ్యుడిలా భావిస్తారని ఖాజా మొయిదీన్ తెలిపారు. డబ్బు అశాశ్వతమని.. మానవత్వమే గొప్పదని నమ్ముతానని ఆయన పేర్కొన్నారు. అందుకే తన శరీరాన్ని తంజావూరు మెడికల్ కాలేజీకి దానం చేశానని గర్వంగా చెబుతారు ఖాజా మెయిదీన్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tamilnadu