Home /News /national /

THIS DIWALI LET US LIGHT A DIYA TO SALUTE OUR SOLDIERS WHO FEARLESSLY PROTECT OUR NATION PM MODI BA

Diwali 2020: సోల్జర్స్‌కి సెల్యూట్‌గా దీపం వెలిగించండి.. ప్రధాని మోదీ పిలుపు

ప్రధాని మోదీ(ఫైల్ పొటో)

ప్రధాని మోదీ(ఫైల్ పొటో)

ఈ దీపావళికి సైనికులకు సెల్యూట్ చేసేందుకు ఓ దీపం వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

    ఈ దీపావళికి సైనికులకు సెల్యూట్ చేసేందుకు ఓ దీపం వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ సందేశాన్ని ఇచ్చారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు నివాళిగా దీపాన్ని వెలిగించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘దేశం కోసం సైనికులు చేసే త్యాగాలను వర్ణించేందుకు మాటలు చాలవు. ఈ దీపావళికి సైనికుల కోసం ఓ దీపం వెలిగించండి. బోర్డర్‌లో ఉన్న వారి కుటుంబాలకు కూడా మనం థాంక్స్ చెబుదాం.’ అని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో సూచించారు. మరోవైపు ఈ ఏడాది దీపావళిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరిహద్దుల్లో సైనికులతో కలసి జరుపుకొంటారని తెలుస్తోంది. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇలా దీపావళి పండుగను బోర్డర్‌లో సైనికులతో కలసి జరుపుకొంటున్నారు.



    పాకిస్తాన్ దుశ్చర్యకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కాశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వద్ద పాకిస్తాన్ రేంజర్లు జరిపి కాల్పులు ఐదుగురు సైనికులు, నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది వరకు గాయపడ్డారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద మూడు చోట్ల ఈ ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో భారత్ - పాకిస్తాన్ మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. పరస్పరం మోర్టార్లు, చిన్న తరహా ఆయుధాలను ప్రయోగించినట్టు తెలిసింది. సరిహద్దుల్లో ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో అత్యధికంగా యూరీ సెక్టార్‌లో ఓ మహిళ సహా ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లు వీరమరణం చెందారు. ఇక నౌగాం సెక్టార్‌లో ఓ బీఎస్ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ చనిపోయాడు. ముగ్గురు పౌరులు గాయపడ్డారు. తాంగ్‌ధర్‌లో ఇద్దరు జవాన్లు గాయపడినట్టు అధికారులు చెప్పారు. పూంఛ్‌లోని సౌజియాన్‌లో మరో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. గ్రామంలో భారీ ఎత్తున బుల్లెట్ల వర్షం కురిసిందని స్థానికులు చెప్పారు.

    మరోవైపు భారత సైనికులు జరిపిన ఎదురుదాడిలో 7-8 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు హతమయ్యారని, 10 నుంచి 12 మంది గాయపడ్డారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. అలాగే, సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ బంకర్లు, ఫ్యూయల్ డంప్స్, లాంచ్ ప్యాడ్స్‌ను భారత సైన్యం ధ్వంసం చేసినట్టు పేర్కొంది. మాచిల్ సెక్టార్‌లో ఉగ్రవాదులను చొరబడేందుకు చేసిన ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టడంతో పాకిస్తాన్ ఆర్మీ ఇలా కాల్పులకు తెగబడిందని ఇండియన్ ఆర్మీ తెలిపింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Indian Army, Pm modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు