స్వాతంత్య్రం నుంచి ఇప్పటివరకు విధి నిర్వహణలో చనిపోయిన పోలీసులు ఎందరో తెలుసా?

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది అగస్టు వరకు మొత్తం 35వేల మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక డేటాలో వెల్లడైంది.

news18-telugu
Updated: October 20, 2019, 1:09 PM IST
స్వాతంత్య్రం నుంచి ఇప్పటివరకు విధి నిర్వహణలో చనిపోయిన పోలీసులు ఎందరో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గతేడాది సెప్టెంబర్ 2018 నుంచి ఈ ఏడాది అగస్టు వరకు మొత్తం 292 మంది పోలీసులు విధి నిర్వహణలో చనిపోయినట్టు అధికారిక లెక్కలు వెలువడ్డాయి. వీరంతా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలతో పాటు రెగ్యులర్ విధుల్లో చనిపోయినట్టుగా అధికారిక డేటా చెబుతోంది. ఇందులో బీఎస్ఎఫ్,సీఆర్‌పీఎఫ్ జవాన్లు కూడా ఉన్నారు. ఈ ఏడాది కశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన 40మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు కూడా ఇందులో ఉన్నారు.ఇక దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది అగస్టు వరకు మొత్తం 35వేల మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక డేటాలో వెల్లడైంది.

గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది అగస్టు వరకు చనిపోయిన భద్రతా దళాల్లో 41 మంది బీఎస్ఎఫ్,23మంది ఇండో-టిబెటన్ భద్రతా దళాలు,24 మంది జమ్మూకశ్మీర్ పోలీసులు ఉన్నారు. మరో 20మంది మహారాష్ట్ర పోలీసులు, గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు ల్యాండ్‌మైన్‌కి
బలైపోయిన 15 మంది పోలీసులు ఇందులో ఉన్నారు. అలాగే ఛత్తీస్‌గఢ్‌కి చెందిన 14మంది పోలీసులు, కర్ణాటకకు చెందిన 12మంది, 11మంది ఆర్పీఎఫ్ సిబ్బంది, 10మంది ఢిల్లీ,రాజస్తాన్ పోలీసులు,7మంది బీహార్ పోలీసులు ఉన్నారు. వీరితో పాటు జార్ఖండ్, ఆంధప్రదేశ్, మధ్యప్రదేశ్,మణిపూర్,హర్యానా,అరుణాచల్ ప్రదేశ్, సిక్కీం,హిమాచల్ ప్రదేశ్,త్రిపుర,సహస్త్ర సీమా బల్,అసోం రైఫిల్స్‌కి జవాన్లు ఉన్నారు.First published: October 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>