viral story : తప్పు చేసింది ఆ యువతే.. పైగా క్యాబ్‌ డ్రైవర్‌ను చితక బాదింది.. బయటపడిన నిజం..

క్యాబ్ డ్రైవర్‌ను కొడుతున్న యువతి

viral story : ఓ యువతి కారణంగా క్యాబ్ డ్రైవర్ పరువు పోయింది.. చేయని తప్పుకు ఓ యువకున్ని బలి చేసింది..దీంతో రోడ్డుమీదే ఆయువకున్ని పిడిగుద్దులు గుద్దింది..అయితే ఆమె తిరిగి తప్పు చేసినట్టుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

  • Share this:
    రెండు రోజుల క్రితం ఓ క్యాబ్ డ్రైవర్ దారిన పోయో తనను అసభ్యంగా తాకడంటూ..లక్నోకు చెందిన యువతి ఇటివల ఆ క్యాబ్ డ్రైవర్‌ను రోడ్డుపైనే బడిత పూజ చేయడంతో..విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.. దీంతో పోలీసులు ఆ క్యాబ్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ తీసుకువెళ్లారు. జరిగిన విషయాన్ని విచారణ చేపట్టారు.. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు...దీంతో.. ఆ దాడిలో యువతి తప్పుగా వ్యవహరించిందంటూ సీసీ కెమెరాల ద్వార బయటపడినట్టు తెలుస్తోంది.... దీంతో ఆ క్యాబ్ డ్రైవర్ తనకు ఆర్ధిక ఇబ్బంది కల్గడంతో పాటు యువతి చేసిన పనికి పరువు కూడా పోయిందని వాపోయాడు..

    ఇంతకి జరిగిందేమిటనేది పోలీసులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లో సదరు యువతి చెప్పినదానికి.. అక్కడ జరిగిన దానికి ఏమాత్రం పొంతన లేదని గమనించారు. దీంతో ఆ వీడియో చూసిన జనం.. ఆ యువతిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ తప్పు లేకుండానే క్యాబ్‌ డ్రైవర్‌ని అవమానించారు.. తప్పు చేసిన యువతిని వదిలేయం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

    ఇంతకు ఆ రోజు ఏం జరిగిందో . క్యాబ్‌ డ్రైవర్‌ మాట్లాడుతూ.. ఇలా చెప్పాడు ఎప్పటిలానే తాను ఆ రోజు క్యాబ్‌ డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్తున్నాడు. ట్రాఫిక్‌ నియమాలను పాటిస్తూ.. అలంబాగ్ నహరియా చౌరహా సిగ్నల్ వద్ద వేచి ఉన్నాడు. ఇంతలో సదరు మహిళ రోడ్డు మీద అజాగ్రత్తగా నడుస్తూ కనిపించింది. దాంతో తాను నెమ్మదిగా వెళ్తున్నానని చెప్పాడు. ఇంతలో ఉన్నట్టుండి ఆమె వెనక్కి వచ్చి నాపై దాడి చేసిందని , తన ముఖాన మొబైల్‌ విసిరికొట్టిందని అన్నాడు .

    ఇక కాసేపటికి అక్కడ జనాలు పోగవడంతో సమస్య మరింత పెద్దదయ్యింది. అతని మాట ఎవరు వినిపించుకోలేదు. ఘర్షణ సమాచారం పోలీసులకు చేరడంతో.. వాళ్లు క్యాబ్ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.. ఈ ఘటనలో కారు కూడ డామేజ్‌ అయ్యిందని చెప్పాడు. కారు రిపేరుకు 60 వేల రూపాయల నష్టం వాటిల్లిందని.. వీటన్నింటికి మించి నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది.. పరువు పోయిందని. నా తప్పు లేకున్నా పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. వీటన్నింటిని తిరిగి సరిచేయగలా.. నా పరువు తెచ్చివ్వగలరా అంటూ పోలీసులను ప్రశ్నించాడు..
    Published by:yveerash yveerash
    First published: