• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • THERE IS NO CHANGE IN THE CONDITION OF PRANAB MUKHERJEE SAYS ARMY HOSPITAL DELHI NK

Pranab Mukhergee: ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం... డాక్టర్లు ఏమన్నారంటే...

Pranab Mukhergee: ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం... డాక్టర్లు ఏమన్నారంటే...

ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం... డాక్టర్లు ఏమన్నారంటే... (File)

Pranab Mukhergee: భారత మాజీ రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు. మరి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై తాజాగా డాక్టర్లు ఏం చెప్పారు?

  • Share this:
    Pranab Mukhergee: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదని తాజాగా డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనీ... వెంటిలేటర్ సపోర్టుతో ట్రీట్‌మెంట్ అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. ప్రణబ్ ముఖర్జీకి రకరకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు (multiple old co-morbidities) ఉన్నాయని వివరించారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం... ఆయన్ని దగ్గరుండి చూసుకుంటోందని ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా నేతలు, ప్రముఖులు కోరుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు రోజూ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేస్తున్నారు. తద్వారా ప్రణబ్ ఆరోగ్యం ఎలా ఉందో దేశ ప్రజలకు తెలుపుతున్నారు.


    ప్రణబ్ ముఖర్జీ వారం నుంచి ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ప్రణబ్ ముఖర్జీకి క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. చికిత్స తరవాత కూడా ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. దానికి తోడు ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఐతే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను కుమారుడు అభిజిత్ ముఖర్జీ, కూతురు షర్మిష్ట ముఖర్జీ ఖండించారు. తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

    తనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సోమవారం ట్విటర్ వేదికగా ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. తాను వేరే కారణాల వల్ల ఆస్పత్రికి వెళితే.. కోవిడ్ 19 పాజిటివ్ అనే విషయం నిర్థారణ అయ్యిందని తెలిపారు. తనను గత వారం రోజులుగా కలిసిన వారంతా సెల్ఫ్ ఐసోలేషన్ పాటించి.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు