హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Relationship: ఇదేం పాడుబుద్ధి.. మేనల్లుడితో అత్త జంప్‌! ఎక్కడో తెలుసా?

Relationship: ఇదేం పాడుబుద్ధి.. మేనల్లుడితో అత్త జంప్‌! ఎక్కడో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కని.. పెంచిన పిల్లల గురించి కూడా ఆలోచించడంలేదు.. మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న అత్త కొన్ని సంవత్సరాలు అతనితో ఎంజాయ్ చేసింది.

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

ఈ మధ్యకాలంలో ఏ రిలేషన్‌ చూసినా ఏదో వింతగా అనిపిస్తుంది.. ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారో.. ఎవరితో కలిసి వెళ్లిపోతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.. మనోవిజ్ఞాన శాస్త్రపరంగా ప్రతీ వ్యక్తిలో లైంగిక భావనలుంటాయి. వీటిని అవగాహన చేసుకుని తమ నియంత్రణలో ఉంచుకునేవారు పరిణితి చెందినవారు. అయితే ఈ మధ్య భర్తలకు హ్యాండిస్తున్న భార్యలు.. భార్యలకు టోపీ పెడుతున్న భర్తలు సమాజంలో పెరిగిపోతున్నారు. వావి వరుసలు మరిచి హద్దు దాటి ప్రవర్తిస్తున్నారు. కని.. పెంచిన పిల్లల గురించి కూడా ఆలోచించడంలేదు.. మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న అత్త కొన్ని సంవత్సరాలు అతనితో ఎంజాయ్ చేసింది. టైమ్‌ చూసి ఇద్దరు కలిసి జంప్‌ అయ్యారు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.

ఏం జరిగిందో తెలుసుకోండి:

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ వింత వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆరుగురు పిల్లల తల్లి అయిన ఓ మహిళ వేరే అబ్బాయితో వెళ్లిపోయింది. తనకంటే 20 ఏళ్లు చిన్నవాడైన మేనల్లుడితో 50 ఏళ్ల వయసులో ప్రేమలో పడింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి పథకం వేసి 60 వేల రూపాయలతో భర్త ఇంటికి పారిపోయింది. నెల రోజులుగా బాధితురాలి భర్త, పిల్లలు ఆమెను వెతుక్కుంటూ ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె ఆచుకీ తెలియడంలేదు.. ఫోన్‌లు ఆఫ్‌ చేసినట్లు సమాచారం.

లవర్స్‌డే రోజు జంప్‌:

సాగర్ జిల్లాకు చెందిన డియోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిమదానాకు చెందిన శ్రావణ్ కుచ్ బండియా తన భార్యను వెతకాలని కోరుతూ పోలీసులో కంప్లైంట్ చేశాడు. తన భార్య హెలెన్బాయి కుచ్బండియా (50) తన మేనల్లుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయినట్లు శ్రవణ్ మీడియాకు తెలిపారు. వారిద్దరూ ఫిబ్రవరి 14 (వాలెంటైన్స్ డే) రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో వెళ్లిపోయారని చెబుతున్నారు. రాత్రి 11.30 గంటలకు అకస్మాత్తుగా నిద్రలేచేసరికి హెలెన్ ఇంట్లో కనిపించలేదన్నారు. తాను మొదట ఫోన్ చేసినప్పుడు ఎలాంటి సమాధానం రాలేదని శరవణ్ చెప్పాడు. ఇంట్లోని ఇతర గదుల్లో కూడా ఆమె ఎక్కడా కనిపించలేదు. భార్య ఇంటి నుంచి కనిపించకుండా పోయిందని.. మరుసటి రోజు ఆమె కోసం వెతికామన్నారు. బంధువులకు ఫోన్ చేశానని.. ఎక్కడా సమాచారం లభించకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చానని చెప్పారు. నెల రోజులు దాటిపోయిందని.. పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సీఎం హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు చేసినా ఎవరూ కనిపెట్టలేకపోయారని వాపోయారు. తన మేనల్లుడు సతీష్ కూడా అప్పటి నుంచి కనిపిండలేదని.. ఇంట్లో ఉండాల్సిన రూ.60వేల రూపాయలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశాడు.

First published:

Tags: Illicit relationship, Madya pradesh

ఉత్తమ కథలు