• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • THERE IS A POSITIVE SIGN IN PRANAB MUKHERJEE HEALTH CONDITION SAYS ABHIJIT MUKHERJEE NK

Pranab Mukhergee: కోలుకుంటున్న ప్రణబ్‌ముఖర్జీ... డాక్టర్లు ఏమన్నారంటే...

Pranab Mukhergee: కోలుకుంటున్న ప్రణబ్‌ముఖర్జీ... డాక్టర్లు ఏమన్నారంటే...

Pranab Mukhergee: కోలుకుంటున్న ప్రణబ్‌ముఖర్జీ... డాక్టర్లు ఏమన్నారంటే... (File)

Pranab Mukhergee: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, డాక్టర్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తున్నారు.

  • Share this:
    Pranab Mukhergee Health: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైనట్లు తెలిసింది. "మీ అందరి విషెస్, డాక్టర్ల గట్టి ప్రయత్నాలతో మా మంత్రి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉంది" అని ప్రణబ్ కొడుకు అభిజిత్ ముఖర్జీ తెలిపారు. "ప్రణబ్ శరీరంలోని కీలక అవయవాలు... కంట్రోల్‌లో ఉన్నాయనీ, చికిత్సకు స్పందిస్తున్నాయి" అని ఆయన వివరించారు. ఆరోగ్యం మెరుగవుతుంది అనేందుకు అనుకూలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి అన్నారు. ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థనలు చెయ్యాలని అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ 10 రోజుల నుంచి ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ప్రణబ్ ముఖర్జీకి క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. చికిత్స తరవాత కూడా ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. దానికి తోడు ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. తాజా ట్వీట్‌తో కొంత పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నట్లే.


    తనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ట్విటర్ వేదికగా ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. తాను వేరే కారణాల వల్ల ఆస్పత్రికి వెళితే.. కోవిడ్ 19 పాజిటివ్ అనే విషయం నిర్థారణ అయ్యిందని తెలిపారు. తనను కలిసిన వారంతా సెల్ఫ్ ఐసోలేషన్ పాటించి.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ప్రణబ్ ముఖర్జీకి రకరకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు (multiple old co-morbidities) ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం... ఆయన్ని దగ్గరుండి చూసుకుంటోందని ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా నేతలు, ప్రముఖులు కోరుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు రోజూ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేస్తున్నారు. తద్వారా ప్రణబ్ ఆరోగ్యం ఎలా ఉందో దేశ ప్రజలకు తెలుపుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: