హోమ్ /వార్తలు /జాతీయం /

ఎన్నికల సభలకు వస్తున్న ప్రజల్లో నాలుగు రకాలు... మీరు ఏ టైపో తెలుసుకోండి...

ఎన్నికల సభలకు వస్తున్న ప్రజల్లో నాలుగు రకాలు... మీరు ఏ టైపో తెలుసుకోండి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Assembly Elections 2019 : వాపును చూసి బలుపు అనుకోవడం ప్రమాదం. ఎన్నికల ప్రచారానికి వస్తున్న వారంతా... తమకే ఓటు వేస్తారని పార్టీలూ, నేతలూ భావిస్తే నష్టమే.

ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న ప్రశ్నకు ఆన్సర్ తెలుసుకోవాలని అందరం అనుకుంటాం. అందుకోసం మనం ఏ పార్టీ ఎన్నికల ప్రచారానికి ఎంత మంది జనం వస్తున్నారో చూసుకొని... ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని లెక్కలేసుకుంటాం. అభ్యర్థుల విషయంలోనూ ఇలాంటి అంచనాలే ఉంటాయి మనకు. కానీ... మన ఆలోచనలకు భిన్నంగా చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు... కొన్నిచోట్ల టీఆర్ఎస్ సభలకు ప్రజలు పెద్దగా రాలేదు. ఆ అంశాల్ని ప్రజాకూటమి పార్టీలు హైలెట్ చేశాయి. తీరా ఫలితాలొచ్చాక ఏం తేలింది. టీఆర్ఎస్‌కి ఇదివరకటి కంటే ఎక్కువ మంది మద్దతిచ్చారు. సో, ఎన్నికల ప్రచారానికీ, సభలకు ప్రజలు రావడానికీ... గెలుపోటములకూ సంబంధం లేదని తేలుతోంది ఈ ఫార్ములాతో.


సభలకు వచ్చే ప్రజలు నాలుగు రకాలు : ఏపీలో పార్టీలూ, అభ్యర్థులూ బహిరంగ సభలు నిర్వహించినప్పుడు మనం గమనిస్తే... ప్రతీ పార్టీకీ జనం బాగానే వస్తున్నారు. అలాగైతే మరి గెలిచేదెవరు, ఓడేదెవరు. సభలకు వచ్చే ప్రజల్లో నాలుగు రకాల వారున్నారు.


1 పార్టీ కార్యకర్తలు : వీళ్లు పార్టీలు, అభ్యర్థులకు హార్డ్ కోర్ ఫ్యాన్స్. వీళ్లు తప్పనిసరిగా బహిరంగ సభలకు వస్తుంటారు. కచ్చితంగా తమ అభిమాన పార్టీలకే ఓటు వేస్తారు. ఈ విషయంలో రెండో మాటే ఉండదు.


2. కాంట్రాక్ట్ కేడర్ : వీళ్లు డబ్బులు తీసుకొని ఆయా బహిరంగ సభలకూ, ప్రచారానికీ హాజరవుతారు. రోజుకు 500 నుంచీ 1000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. అదనంగా బీరు, బిర్యానీ వంటివి కూడా ఆయా పార్టీలు, అభ్యర్థులూ ఆఫర్ చేస్తున్నాయి. వీళ్లను తీసుకురావడం, తిరిగి తీసుకెళ్లడం అన్నీ పార్టీలు, అభ్యర్థులే చూసుకోవాల్సి ఉంటోంది. సభలో ఉన్నంత సేపూ వీళ్లు ఆయా పార్టీల జెండాలు మోస్తారు. చురుగ్గా మాట్లాడతారు. నినాదాలు చేస్తారు. ఆ రోజంతా ఆ పార్టీకి కంకణబద్ధులై ఉంటారు. వీళ్లు అదే పార్టీకి ఓటు వేస్తారా అన్నది మాత్రం బయటకు తెలీదు. తమ అభిప్రాయంతో సంబంధం లేకుండా... సభలకు వస్తుంటారు.


3. తటస్థ ఓటర్లు : వీళ్లు ప్రత్యేకమైన ఓటర్లు డబ్బులిచ్చినా, ఇవ్వకపోయినా బహిరంగ సభలకు వస్తారు. అన్ని పార్టీల సభలకూ వెళ్తుంటారు. అందరు అభ్యర్థుల హామీలు, అజెండాలు, మేనిఫెస్టోలు అన్నీ తెలుసుకుంటారు. తద్వారా ఎవరికి ఓటు వెయ్యాలో నిర్ణయానికి వస్తుంటారు. ఎన్నికలు జరిగే రోజు వరకూ వీళ్లు తుది నిర్ణయం తీసుకోరు. చివరి రోజున అన్ని అంశాల్నీ లెక్కలోకి తీసుకొని... ఎవరు అధికారంలోకి వస్తే కలిసొస్తుందో ఆలోచించుకొని... అప్పుడు మాత్రమే ఓటువేస్తారు.


4. సరదా ఓటర్లు : ఈ తరహా ఓటర్లు నాయకులను చూద్దామనో, కాలక్షేపానికో బహిరంగ సభలకు వస్తుంటారు. మొత్తం జనాభాలో వీరి సంఖ్య చాలా తక్కువే ఉంటుంది. వీళ్లు ఎవరికి ఓటు వెయ్యాలో మనసులో నిర్ణయించుకుంటారు. బయటకు మాత్రం అదే పార్టీకి ఓటు వేసేవారిలా బహిరంగ సభల్లో పాజిటివ్‌గా కనిపిస్తారు.


ఇలా బహిరంగ సభలు, ప్రచారాలకు వస్తున్న వారిలో... రకరకాల వ్యక్తులుంటున్నారు. అసలు ఏ సభలకూ రాకుండా కూడా... టీవీలు, మొబైళ్లల్లో ప్రసంగాలు వింటూ... ఎవరికి ఓటు వెయ్యాలో నిర్ణయించుకునే వారూ ఉన్నారు. అందువల్ల మనం సభలకు వచ్చే ప్రజల్ని చూసి... ఎవరికి ఓటు వెయ్యాలో నిర్ణయం తీసుకోవడం కరెక్టు కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏ పార్టీ, ఏ అభ్యర్థి అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందో... ఆ పార్టీ, ఆ అభ్యర్థిని మాత్రమే గెలిపించుకోవాలని సూచిస్తున్నారు.


 


ఇవి కూడా చదవండి :


వైసీపీ మద్యపాన నిషేధం హామీ టీడీపీకి కలిసొస్తుందా... మద్యాన్ని నిషేధిస్తామనడం ప్రజలకు నచ్చట్లేదా...


రేపటి నుంచీ ఐదు రోజులు టీడీపీ నిరసన కార్యక్రమాలు... ఎన్నికలు జరిగే రోజున కూడా...


ఎండు ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తింటే.... ప్రయోజనాలు ఇవీ...

First published:

Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019

ఉత్తమ కథలు