రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గాలు అంటే ఏంటి..? అక్కడ నోటాకు వెయ్యడమే బెటరా..?

Lok Sabha Election 2019 : రాజకీయాలు-నేరాలూ రెండూ విడదీయలేనంతగా ముడిపడిపోయాయి మన దేశంలో. నేతలుగా చెప్పుకుంటున్న చాలా మంది రకరకాల నేరాలు చేస్తూ, పెండింగ్ కేసులు ఉండగానే... ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఫలితంగా రెడ్ అలర్ట్ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 9, 2019, 9:13 AM IST
రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గాలు అంటే ఏంటి..? అక్కడ నోటాకు వెయ్యడమే బెటరా..?
పెరుగుతున్న రెడ్ అలర్ట్ నియోజకవర్గాల సంఖ్య
Krishna Kumar N | news18-telugu
Updated: May 9, 2019, 9:13 AM IST
Red Alert Constituencies : లోక్ సభ ఎన్నికల్లో ఏ కేసులూ లేని అభ్యర్థులను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. కారణం ప్రతీ అభ్యర్థికీ మినిమం ఒక్కటైనా కేసు పెండింగ్‌లో ఉంటోంది. ఇలాంటి కేసుల్లో దోషులుగా తేలే లాలూ ప్రసాద్ లాంటి వాళ్లు... ఎన్నికలకు దూరంగా ఉంటున్నా, తమ వారసత్వాన్ని ఆల్రెడీ రంగంలోకి దించాకే తప్పుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమాత్రం ప్రజాస్వామ్యాన్ని ప్రక్షాళన చెయ్యలేకపోతోంది. ఫలితమే రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు. ఏ నియోజకవర్గంలోనైనా పోటీ చేసే అభ్యర్థుల్లో ముగ్గురు లేదా అంతకు మించి అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఉంటే ఆ నియోజకవర్గాన్ని రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గంగా భావిస్తారు. పోలింగ్ టైంలో అక్కడ ఎక్కువ భద్రతా చర్యలు తీసుకుంటారు. ఇంతకంటే దురదృష్టం ఉంటుందా. ఈ రాజకీయ పార్టీలకు నేర చరిత లేని నేతలే దొరకట్లేదా...

ఆరో దశ లోక్ సభ ఎన్నికలు మే 12న జరగబోతున్నాయి. 7 రాష్ట్రాల్లో మొత్తం 59 లోక్ సభ నియోజకవర్గాల్లో 34 స్థానాలు రెడ్‌ అలర్డ్‌ కిందకు వస్తాయని ఏడీఆర్ (Association for Democratic Reforms) తెలిపింది. అంటే... ఆ 34 నియోజక వర్గాల్లో ప్రతీ స్థానంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారన్నమాట.

ఆరో దశలో 967 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో 20 శాతం మంది అంటే దాదాపు 190 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాళ్లలో 48 శాతం మంది బీజేపీ అభ్యర్థులే. కాంగ్రెస్‌ అభ్యర్ధుల్లో 44 శాతం మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఆరో దశలో బీజేపీ నుంచీ 54 మంది పోటీ చేస్తున్నారు. వాళ్లలో 26 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. అలాగే, కాంగ్రెస్‌ తరపున బరిలో దిగిన 46 మందిలో 20 మందిపై కేసులున్నాయి. బీఎస్పీ అభ్యర్థులు 49 మందిలో 19 మందిపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక 307 మంది ఇండిపెండెంట్లు బరిలో దిగుతుంటే వాళ్లలో 34 మందిపై క్రిమినల్ కేసులు వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. అలా ఉంది మన ప్రజాస్వామ్యం.ఆరో దశలో పోటీ చేస్తున్న 967 మందిలో 146 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. వాళ్లలో నలుగురిని కోర్టు దోషులుగా ప్రకటించింది. అయినప్పటికీ వాళ్లు పైకోర్టుకు వెళ్లడం వల్ల... అక్కడ విచారణ ఎదుర్కొంటూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఇక 967 మందిలో ఆరుగురిపై హత్య కేసులున్నాయి. 25 మందిపై హత్యాయత్నం కేసులు పెండింగులో ఉన్నాయి. ఇలాంటి వాళ్లు గెలిస్తే, ఇక ప్రజలను బతకనిస్తారా? 21 మందిపై మహిళల్ని రేప్ చేసిన, మహిళలపై వేధింపులకు పాల్పడిన కేసులున్నాయి. ఇలాంటి వాళ్లకు పార్టీలు టికెట్లు ఎందుకిస్తున్నాయన్నది తేలాల్సిన అంశం. ఇలాగైతే ఇండియా ఏం బాగుపడుతుందన్న సామాన్యుల ప్రశ్నకు సమాధానం దొరకదేమో.

 
Loading...
ఇవి కూడా చదవండి :

ఈసారి ఏపీ ఫలితాలు గందరగోళమేనా... వీవీప్యాట్లు వైసీపీ, టీడీపీ, జనసేన కొంప ముంచబోతున్నాయా...

దగ్గరవుతున్న బీజేపీ, వైసీపీ ... ఫలితాల తర్వాత పొత్తు..? ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా.. ?

చంద్రబాబు ప్రధాని అవ్వగలరా...? ఉండవల్లి వ్యాఖ్యల వెనక వ్యూహం ఏంటి ?
First published: May 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...