వంట చేస్తూ నిలబడి ఉంది.. అప్పటివరకు కూరకు అవసరమైన ఉల్లిపాయలు కోసింది.. పొయ్యి వెలిగించింది.. ఇంతలోనే బుస్ బుస్ అని శబ్దం వినపడింది.. ఆ లైట్‌లే అనుకుంది.. మళ్లీ అదే సౌండ్ రావడంతో భయం భయంగా గ్యాస్ బండవైపు చూసింది.. అంతే షాక్.. పామును దగ్గర చూస్తే ఎవరికైనా వణుకు రావాల్సిందే.. కొంతమందికి జ్వరం కూడా వస్తుంది.. మరి కొంతమంది స్పృహ కోల్పోతారు.. అలాంటి ఘటనే రాజస్థాన్‌లోని కోటలో జరిగింది. పామును దగ్గర నుంచి చూసిన ఓ మహిళ స్పృహ కోల్పోయింది.
రెయిన్ ఎఫెక్ట్:
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. రాజస్థాన్‌లోని కోటలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో పాములు ఇళ్లలోకి దూరడం మొదలుపెట్టాయి. కోటలోని డీసీఎం ప్రాంతంలోని ఇందిరాగాంధీ నగర్‌లోని ఓ ఇంట్లో వంట చేస్తున్న మహిళ నాగుపామును చూపి స్పృహ కోల్పోయింది. పామును చూసిన ఇంట్లోని మరో మహిళ కేకలు వేస్తూ ఇంటి బయటకి వచ్చింది. అది చూసిన ఇంటిలోని సభ్యులు కూడా భయపడి ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత పాము ఇంట్లోకి వచ్చిందనే సమాచారాన్ని స్నాక్స్ క్యాచర్ గోవింద్ శర్మకు అందించారు. సమాచారం అందుకున్న పాములు పట్టే గోవింద్ శర్మ ఘటనా స్థలానికి చేరుకుని నల్ల నాగుపామును జాగ్రత్తగా రక్షించి అటవీశాఖ అధికారులకు అప్పగించాడు. వాళ్లు దాన్ని అడవిలో విడిచిపెట్టారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో వర్షం పడుతోందని అందుకే పాములు తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వర్షం ఎక్కువ పడినప్పుడు పాములు సాధారణంగా బయటకు వస్తాయి. ఇంట్లో కానీ, ఎక్కడైనా పాము కనిపిస్తే అక్కడే ఉండాలని, దానికి హాని చెయొద్దని అధికారులు చెబుతున్నారు.
పాములు ఇళ్లలోకి రాకుండా ఏం చేయాలి:
ప్రస్తుతం పలు ప్రాంతాలలో వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ వర్షాలకు పాములు భూమిలోపలి నుంచి చల్లగా బయట తిరుగుతుంటాయి. ఇక ఈ సమయాలలోనే ఎక్కువగా ఇళ్లలోకి వస్తుంటాయి. అయితే పాములు ఇంట్లోకి రాకుండా ఏం చేయాలో ఈ టిప్స్ పాటించండి. బ్లీచింగ్ పౌడర్ పాములు ఇంటిలోకి రాకుండా చేస్తుంది. బ్లీచింగ్ వాసన పాములకు నచ్చదు,వాటి వాసన వస్తే చాలు పాములు పారిపోతాయి. ఒక వేళ దాని స్మెల్ చూసిన అవి చనిపోతాయి. అందువలన బ్లీచింగ్‌తో ఈజీగా పాములకు చెక్ పెట్టవచ్చు. పాములకు ఆహారం ఎలుకలు. వీటిని వెతుక్కుంటూనే పాములు వస్తుంటాయి. అందువలన ఇంట్లో ఎలుకలు లేకుండా చూసుకోవాలి.. చిన్న చిన్న హోల్స్ ఉంటే మూసి వేయాలి. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. చుట్టు పక్కల ఎలాంటి చెత్త చెదారం వేయకూడదు. తోటలోని గడ్డిని ట్రిమ్ చేస్తూ ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.