తమిళనాడు(Tamil Nadu)లోని ఓ ప్రాంతంలో గతేడాది డిసెంబరులో సమృద్ధిగా వాన(Rain)లు కురిశాయి. చుట్టు పక్కల ప్రాంతాలలో వరదలు కూడా వచ్చాయి. కొన్ని కోట్ల లీటర్ల నీరు భూమిలోకి ఇంకింది. అయినా సరే వ్యవసాయ(Agriculture) అవసరాలకు ఉపయోగించే ఓ బావి(Well) నిండలేదు. అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్న ఈ విషయంపై పరిశోధన చేసిన ఐఐటీ మద్రాసు(IIT Madras Team) నిపుణుల బృందం .. తాజాగా ఈ మిస్టరీ బావికి సంబంధించిన సీక్రెట్స్‌ను వెల్లడించింది. సున్నపురాయి నిక్షేపాలతో బావి కనెక్ట్ అయి ఉండటంతో, ఆ బావిలో నీరు నిల్వ ఉండట్లేదని ఐఐటీ మద్రాస్ నిపుణులు తాజాగా గుర్తించారు. ఇదే విధంగా ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో 14 బావులు ఉన్నాయని వివరించారు. స్థానిక అధికారుల అభ్యర్థనతో దాదాపు ఏడు నెలల పాటు బావి చుట్టు పక్కల ప్రాంతాలను ఈ బృందం పరిశీలించి, తాజా వివరణ ఇచ్చింది.
గత డిసెంబర్‌లో తిసాయన్‌విలై తాలూకాలోని కొన్ని ప్రాంతాలలో పెద్ద వరదలు వచ్చినప్పుడు, అయంకులం వద్ద ఉన్న ఒక వ్యవసాయ బావి కొంచెం కూడా నిండలేదు. బావిలోకి దాదాపు 500-600 కోట్ల లీటర్ల నీరు చేరినా, దాంట్లో నీరు నిల్వ ఉండలేదు. అయితే భారీ వరదలు వచ్చినా నిండని వ్యవసాయ బావికి సున్నపురాయి(Limestone) నిక్షేపాలు అడ్డుగా ఉన్నాయని ఐఐటీ మద్రాసు నిపుణుల పరిశోధనలో తేలింది.
వెయ్యి సంవత్సరాల సున్నపురాయి నిక్షేపాలు
వ్యవసాయ బావి సున్నపురాయి లేయర్‌లతో కలిసి ఉందని, ఇది ఏర్పడటానికి 1,000 సంవత్సరాలు పట్టవచ్చని జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. అసెంబ్లీ స్పీకర్ ఎం.అప్పావు, జిల్లా కలెక్టర్ వి.విష్ణు సోమవారం బావిని పరిశీలించారు. మట్టి నమూనాలను సేకరించేందుకు బృందం 22 కొత్త బోర్‌వెల్‌లను తవ్వింది. కలెక్టర్ అభ్యర్థన మేరకు ప్రారంభించిన అధ్యయనంలో సున్నపురాయి నిక్షేపాలు, భూగర్భ ప్రవాహాలను కనుగొన్నారు. అధ్యయనం ప్రకారం.. కీరైకరంతట్టు, సాతంకులం, సువిశేషపురం, ఇడైచివిల్లై సమీపంలోని 14 బావులు సహజంగా సున్నపురాయి నిక్షేపాలతో ముడిపడి ఉన్నట్లు తేలింది.
ఇతర 14 బావుల కంటే ఆయంకులం వ్యవసాయ బావి చాలా ప్రత్యేకమైంది. ఇది 30-40 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతుందని అధికారులు గుర్తించారు. డ్యామ్‌లు, ఇతర వనరులు ఆవిరైపోయే అవకాశం ఉన్నప్పటికీ, భూగర్భ జలాలను రైతులు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. వర్షపు నీటిని భూగర్భ ప్రవాహాల ద్వారా చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ బావులకు పంపవచ్చు. ఇది తిసాయన్విలై ప్రాంతంలో నీటిపారుదల నీటి-పంపిణీ వ్యవస్థ అవసరం లేకుండా చేస్తుంది. నీటి భాగస్వామ్య వివాదాలను కూడా పరిష్కరిస్తుంది. జిల్లా యంత్రాంగం భూగర్భ జలాల విస్తీర్ణాన్ని 200 చదరపు కి.మీలకు విస్తరించనుంది.
ఐఐటీ మద్రాస్ బృందం కీరైకా-రంతట్టు, సాతంకులం, సువిశేషపురం, ఇడైచివిల్లై సమీపంలో 14 బావులను కనుగొంది. ఇవి సహజంగా సున్నపురాయి కార్స్ట్ నిక్షేపాలతో ముడిపడి ఉన్నాయి. అయితే 30-40 చ.కి.మీ వ్యాసార్థంలో భూగర్భ జలాలను రీఛార్జ్ చేయగలిగిన ఆయంకులం వ్యవసాయ బావి ప్రత్యేకం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, IIT Madras, Tamilnadu rains, Water problem