కరోనా వైరస్.. భారత్‌లో సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. కరోనా వైరస్.. భారత్ లో సృష్టించిన సంక్షోభం అంతాఇంతా కాదు. 2019లోనే కరోనాను చైనాలో గుర్తించినట్టు పలు నివేదికలు చెబుతుండగా..భారత్‌లో మొట్టమొదటి కరోనా కేసు 2020 జనవరి 30న గుర్తించారు.. ఇక అప్పటినుంచి మొదలైన వైరస్ విలయం రోజుకు 4లక్షల కేసుల వరుకు వెళ్లింది.. అయితే డెత్ రేట్స్ విషయంలో భారత్‌ను కాపాడింది మాత్రం వ్యాక్సినే.. అసలు టీకానే లేకపోయి ఉంటే ప్రతీ కరోనా కేసూ సీరియస్‌గానే ఉండేది.. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ జర్నీపై ‘హిస్టరీ TV18’ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ద వయల్’ (The Vial) ఇప్పుడు చర్చనీయాంశమైంది. 63 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీకి ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పేయి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
విషాదాన్ని, ఆనందాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన మనోజ్ బాజ్‌పేయి:
మనోజ్ బాజ్‌పేయి ఎలాంటి నటులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు.. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే మనోజ్ బాజ్‌పేయి 'ద వయల్' డాక్యుమెంటరీని అద్భుతంగా ప్రజెంట్ చేశారు.. ఆయన మాట్లాడుతుంటే గతమంతా కళ్లముందే ఉన్నట్లు అనిపించింది.. కరోనా నాటి పరిస్థితులు, ప్రజల బాధలు, కేంద్ర ప్రభుత్వం సహకారం, ప్రజల మద్దతు, వ్యాక్సిన్ జర్నీ, సైంటిస్టుల కృషి, డాక్టర్ల శ్రమ, హెల్త్ లైన్ వర్కర్ల త్యాగాలు.. ఇలా ప్రతీ విషయాన్ని మనోజ్ బాజ్‌పేయి ఎంతో గొప్పగా వివరించారు.. హిస్టరీ TV18లో ప్రసారమైన 'ద వయల్' డాక్యుమెంటరీలో మనోజ్ బాజ్‌పేయి ఎక్స్‌ప్లనేషన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీలో వ్యాఖ్యాతగా మనోజ్ బాజ్‌పేయి తప్ప మరెవ్వరూ ఇంత బాగా వివరించాలేరంటున్నారు.
వ్యాక్సిన్ జర్నీపై గొప్ప డాక్యుమెంటరీ:
కరోనా వ్యాక్సినేషన్‌పై ఈ డాక్యుమెంటరీలో ప్రధాని మోదీ , భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, నారాయణ హృదయాలయ డాక్టర్ దేవి శెట్టి తదితరులు మాట్లాడారు. కరోనా వ్యాక్సినేషన్‌లో ఇండియా సృష్టించిన రికార్డులు.. కొవిన్ పొర్టల్ విశేషాలు, ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించిన తీరు, కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కంపెనీలకు ఇచ్చిన ప్రోత్సాహం లాంటి విషయాలను 'ద వయల్' డాక్యుమెంటరీలో చక్కగా వివరించారు. ఇక ఎన్నో సవాళ్లు ఎదురైనా.. సమయంలో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించిన మన హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఈ డాక్యుమెంటరీ అంకితమన్నారు మనోజ్‌బాజ్‌పేయి. మనం ఇవాళ ఇళ్ల నుంచి బయటకు వస్తున్నామంటే కారణం వారేనన్నారు. మిజోరంలోని ఒక చిన్న గ్రామానికి వ్యాక్సిన్లు ఎలా చేరాయో మనోజ్ బాజ్‌పేయి వివరించారు. ఇక మహమ్మారిపై దేశం సాధించిన విజయం గురించి ప్రధాని మోదీ వివరంగా మాట్లాడిన మొదటి డాక్యుమెంటరీ ఇది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona Vaccine, Manoj bajpayee